Pakistan: మా భూభాగం గుండా అఫ్గాన్‌కు భారత్‌ గోధుమలు పంపుకోవచ్చు

అఫ్గానిస్థాన్‌కు 50 వేల మెట్రిక్‌ టన్నుల గోధుమలను తమ భూభాగం ద్వారా పంపించేందుకు భారత్‌ను అనుమతించనున్నట్లు పాకిస్థాన్‌ ప్రధానమంత్రి 

Updated : 23 Nov 2021 16:26 IST

ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రకటన 

ఇస్లామాబాద్‌: అఫ్గానిస్థాన్‌కు 50 వేల మెట్రిక్‌ టన్నుల గోధుమలను తమ భూభాగం ద్వారా పంపించేందుకు భారత్‌ను అనుమతించనున్నట్లు పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రకటించారు. ఇందుకోసం రవాణా విధివిధానాలను ఖరారు చేసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. ఇస్లామాబాద్‌లో ‘అఫ్గానిస్థాన్‌ అంతర్‌ మంత్రిత్వ సమన్వయ సెల్‌’ తొలి అపెక్స్‌ కమిటీ సమావేశానికి ఇమ్రాన్‌ సోమవారం అధ్యక్షత వహించారు. అఫ్గాన్‌లో మానవీయ సంక్షోభం తలెత్తకుండా నివారించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. మానవతా సహాయం కింద ఆ దేశానికి భారత్‌ అందించాలని నిర్ణయించిన 50 వేల మెట్రిక్‌ టన్నుల గోధుమలను పాక్‌ భూభాగం ద్వారా పంపించేందుకు అనుమతిస్తామని చెప్పారు. వాఘా సరిహద్దు ద్వారా వాటిని పంపేందుకు అనుమతించాలని గత నెలలో పాక్‌ను భారత్‌ కోరింది. భారత్‌కు సంబంధిత అనుమతులు మంజూరు చేయాలని అఫ్గాన్‌ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్‌ ఖాన్‌ ముత్తకీ కూడా ఇమ్రాన్‌కు విన్నవించారు. అఫ్గాన్‌కు మన దేశం గత దశాబ్ద కాలంలో 10 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా గోధుమలను పంపించిన సంగతి గమనార్హం. ప్రస్తుతం తమ సరిహద్దుల ద్వారా భారత్‌కు అఫ్గాన్‌ సరకుల ఎగుమతినే పాక్‌ అనుమతిస్తోంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని