Updated : 08/11/2021 10:53 IST

రోడ్డు వేయకపోతే ఎమ్మెల్యేను చెప్పులతో కొట్టి చంపేస్తాం

 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహదేవ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భాజపా ఎమ్మెల్యే రవి సోంకర్‌కు వ్యతిరేకంగా పలువురు మహిళలు నిరసన చేపట్టారు. చెప్పులు చేతిలో పట్టుకొని ఎమ్మెల్యేకు హెచ్చరికలు చేశారు. ‘‘ఇక్కడి ప్రజలు రవి సోంకర్‌కు ఓట్లేసి అసెంబ్లీకి పంపించారు. కానీ ఐదేళ్లలో ఈ గ్రామ ప్రజల కోసం ఎమ్మెల్యే రోడ్డు వేయించలేకపోయారు. ఆయనకు ఓట్లు అడిగే హక్కు లేదు. వెంటనే రోడ్డు వేయించకపోతే ఎమ్మెల్యేకు చెప్పులతో స్వాగతం పలుకుతాం. చెప్పులతోనే కొట్టి చంపేస్తాం’’ అంటూ శకుంతలా దేవి అనే మహిళ బహిరంగంగా హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. శకుంతల ఒకప్పుడు భాజపా మహిళా మోర్చా విభాగానికి మండల అధ్యక్షురాలిగా పనిచేశారు. ఎమ్మెల్యేతో విభేదాల కారణంగా పార్టీ నుంచి బయటకొచ్చారు. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని