Ayodhya: అయోధ్య పేరిట రెండు రైల్వేస్టేషన్లా!

ఉత్తర్‌ప్రదేశ్‌లో 19వ శతాబ్దం నాటి ఫైజాబాద్‌ రైల్వేస్టేషన్‌ పేరును ఇటీవల ‘అయోధ్య కంటోన్మెంట్‌’గా

Updated : 16 Sep 2022 14:06 IST

 ఫైజాబాద్‌ పేరు మార్పుపై మిశ్రమ స్పందన

ఫైజాబాద్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లో 19వ శతాబ్దం నాటి ఫైజాబాద్‌ రైల్వేస్టేషన్‌ పేరును ఇటీవల ‘అయోధ్య కంటోన్మెంట్‌’గా మార్చడంపై చరిత్రకారులు, స్థానికుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. 2018లో ఫైజాబాద్‌ జిల్లాను రాష్ట్ర ప్రభుత్వం అయోధ్య జిల్లాగా పేరు మార్చింది. ప్రస్తుతం అక్కడి రైల్వేస్టేషన్‌ బోర్డులు కూడా మారిపోతున్నాయి. ఇవన్నీ చారిత్రక నగరానికి ఉన్న గుర్తింపును చెరిపేస్తున్నాయని స్థానికుల్లో ఎక్కువమంది పెదవి విరుస్తున్నారు. పైగా ఇక్కడికి 10 కిలోమీటర్ల దూరంలోనే ‘అయోధ్య’ పేరుతో మరో రైల్వేస్టేషన్‌ ఉండటంతో ప్రయాణికుల్లో గందరగోళం ఏర్పడుతోందని చెబుతున్నారు. మరో వర్గం ప్రజలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వ చర్యలను స్వాగతిస్తున్నారు. అయోధ్య అన్న పేరుతో ఇది రాముడి నగరమన్న విశేష గుర్తింపు వస్తుందని పేర్కొంటున్నారు. హిందువుల మనోభావాల పేరిట రాజకీయ లబ్ధి పొందాలన్నదే భాజపా ప్రభుత్వ వ్యూహమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ మాత్రం.. గొప్ప చారిత్రక, సాంస్కృతిక గుర్తింపును పునరుద్ధరించాలన్నదే తమ ఉద్దేశమని చెబుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని