Israel PM: మా పార్టీలో చేరండి.. మోదీని కోరిన ఇజ్రాయెల్‌ ప్రధాని

భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్‌లో మంచి ప్రజాదరణ ఉందని, అందువల్ల ఆయన తమ యామినా పార్టీలో చేరాలని ఇజ్రాయెల్‌ ప్రధాని నాఫ్తాలీ

Published : 03 Nov 2021 11:58 IST

గ్లాస్గో: భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్‌లో మంచి ప్రజాదరణ ఉందని, అందువల్ల ఆయన తమ యామినా పార్టీలో చేరాలని ఇజ్రాయెల్‌ ప్రధాని నాఫ్తాలీ బెన్నెట్‌ సరదాగా ఆహ్వానించారు. హైటెక్‌ పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణలపై సహకారాన్ని విస్తరించుకోవడంపై ఇద్దరు నేతలు చర్చలు జరిపారు. ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు ఏర్పడి వచ్చే ఏడాదితో 30 ఏళ్లు పూర్తవుతున్నందువల్ల భారత్‌ రావాలని బెన్నెట్‌ను మోదీ ఆహ్వానించారు. రెండు దేశాల మధ్య మైత్రిని మోదీ బలోపేతం చేశారని ఇజ్రాయెల్‌ ప్రధాని కొనియాడారు. రెండు దేశాల ఆవిష్కర్తల మధ్య అద్భుత సమన్వయం ఉందంటూ స్వీయ అనుభవాన్ని వివరించారు. ‘‘నేను ఒకప్పుడు హైటెక్‌ కంపెనీని నడిపేవాడిని. ఆ తర్వాత అమెరికాలోని ఒక భారతీయ కంపెనీలో దాన్ని విలీనం చేశా. అనంతరం ఇరు దేశాలకు చెందిన సాంకేతిక నిపుణులు కలిసి పనిచేసి, అద్భుత ఆవిష్కరణలు చేశారు. మీ నుంచి నేర్చుకోవడానికి ఎంతో ఉంది’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని