Covid: వాసన చూసి.. కరోనాను పసిగడుతుంది 

రద్దీగా ఉన్న ప్రాంతంలో.. కొవిడ్‌-19 సోకిన వ్యక్తిని అక్కడికక్కడే పసిగట్టే ఒక సాధనాన్ని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు

Updated : 14 Jun 2021 10:22 IST

ఎలక్ట్రానిక్‌ సాధనాన్ని అభివృద్ధి చేసిన బ్రిటన్‌ శాస్త్రవేత్తలు 

లండన్‌: రద్దీగా ఉన్న ప్రాంతంలో.. కొవిడ్‌-19 సోకిన వ్యక్తిని అక్కడికక్కడే పసిగట్టే ఒక సాధనాన్ని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. సదరు వ్యక్తి శరీరం నుంచి వెలువడే వాసనను ఇది విశ్లేషించి, ఈ నిర్ధారణ చేస్తుంది. ఈ ఎలక్ట్రానిక్‌ సాధనానికి ‘కొవిడ్‌ అలారం’ అని పేరు పెట్టారు. కరోనా బాధితుల నుంచి ఒకింత విభన్నమైన వాసన వస్తుందని శాస్త్రవేత్తలు ఇప్పటికే తేల్చారు. వోలటైల్‌ ఆర్గానిక్‌ కాంపౌండ్స్‌ (వీవోసీ) లో మార్పులే ఇందుకు కారణమని వారు పేర్కొన్నారు. వీరిలో ప్రధానంగా కీటోన్, ఆల్డిహైడ్‌కు సంబంధించిన పదార్థాలు ఉంటాయని వివరించా రు. వాసనపరంగా వాటికి ప్రత్యేక ముద్ర ఉంటుందని చెప్పారు. దీన్ని పసిగట్టేందుకు ఎల్‌ఎస్‌హెచ్‌టీఎం, రోబోసైంటిఫిక్‌ లిమిటెడ్, దర్హామ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు.. ఆర్గానిక్‌ సెమీ కండక్టింగ్‌ సెన్సర్లతో ఒక సాధనాన్ని రూపొందించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని