యాప్‌ల నిషేధం.. ఆందోళనలో చైనా!

బహుళ ప్రజాదరణ పొందిన టిక్‌టాక్‌ సహా 59 ప్రధాన మొబైల్‌ యాప్‌లను నిషేధించి..సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాను దారిలోకి తెచ్చుకోవాలన్న మోదీ ప్రభుత్వం వ్యూహాత్మక చర్యపై డ్రాగన్‌ స్పందించింది.......

Published : 30 Jun 2020 14:23 IST

బీజింగ్‌: బహుళ ప్రజాదరణ పొందిన టిక్‌టాక్‌ సహా 59 ప్రధాన మొబైల్‌ యాప్‌లను నిషేధించి..సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాను దారిలోకి తెచ్చుకోవాలన్న మోదీ ప్రభుత్వం వ్యూహాత్మక చర్యపై డ్రాగన్‌ స్పందించింది. ఈ చర్య తమని తీవ్ర ఆందోళన కలిగించే అంశమని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్‌ ప్రకటించారు. పరిస్థితుల్ని సమీక్షిస్తున్నామన్నారు. అంతర్జాతీయ, ఆయా దేశాల నియమ నిబంధనలు, చట్టాలకు అనుగుణంగానే వ్యవహరించాలని చైనా కంపెనీలకు చెబుతుంటామని చెప్పుకొచ్చారు. భారత్‌ సైతం నిబంధనలకు అనుగుణంగా చైనా సహా అంతర్జాతీయ పెట్టుబడిదారులకు హక్కులు కల్పించాలంటూ.. జరిగే నష్టాన్ని చెప్పుకోలేక  గాంభీర్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. 

తాజా వ్యాఖ్యలను బట్టి చూస్తే చైనా ఆర్థిక మూలాలకు హెచ్చరికలు పంపే వ్యూహంలో భాగంగా యాప్‌లను నిషేధించాలన్న భారత ప్రభుత్వ నిర్ణయం డ్రాగన్‌ను కలవపెడుతున్నట్లు కనిపిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

టిక్‌టాక్‌ సహా 59 ప్రధాన మొబైల్‌ యాప్‌లను నిషేధిస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ యాప్‌ల వల్ల భారత సార్వభౌమత్వం, సమగ్రత, ప్రజల వ్యక్తిగత గోప్యతకు ముప్పు పొంచి ఉండడంతో ఐటీ చట్టంలోని సెక్షన్‌ 69-ఎ కింద వీటిని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై స్పందించిన టిక్‌టాక్‌.. భారత నిబంధనలకు తాము అనుసరిస్తున్నామని చెప్పుకొచ్చింది.

ఇవీ చదవండి..
డిజిటల్‌ యుద్ధం
చైనాపై ఎలాంటి ప్రభావం?

నిషేధంపై టిక్‌టాక్‌ స్పందన ఇదే..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు