భారత్‌-చైనా ఘర్షణ: మోదీతో ఆర్మీ చీఫ్‌ సమావేశం!

భారత సైన్యాధిపతి మనోజ్‌ ముకుంద్‌ నరవణె గురువారం ప్రధాని నరేంద్రమోదీతో సమావేశం కానున్నారు. సరిహద్దుల్లో పరిస్థితులు, సైనిక సన్నద్ధత గురించి ప్రధానికి వివరిస్తారని సమాచారం. చైనా సరిహద్దుల్లో ఆర్మీ చీఫ్‌ రెండు రోజుల...

Published : 25 Jun 2020 13:54 IST

రెండు రోజుల పర్యటన వివరాలు వెల్లడించనున్న ఎంఎం నరవణె

ముంబయి: భారత సైన్యాధిపతి మనోజ్‌ ముకుంద్‌ నరవణె గురువారం ప్రధాని నరేంద్రమోదీతో సమావేశం కానున్నారు. సరిహద్దుల్లో పరిస్థితులు, సైనిక సన్నద్ధతపై ప్రధానికి వివరిస్తారని సమాచారం. చైనా సరిహద్దుల్లో ఆర్మీ చీఫ్‌ రెండు రోజుల పర్యటన ముగిసిన సంగతి తెలిసిందే.

వారం క్రితం గల్వాన్‌ లోయలో భారత్‌, చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. డ్రాగన్‌ సైనికులు సైతం రెట్టింపు సంఖ్యలో మరణించారని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో ఉద్రికత్తలు నెలకొన్నాయి. రెండు దేశాలూ భారీ సంఖ్యలో జవాన్లను అక్కడికి తరలిస్తున్నాయి. మరోవైపు ఉద్రికత్తలు తగ్గించేందుకు సైనిక, దౌత్య పరమైన చర్చలు సాగుతున్నాయి.

ఒకవైపు శాంత్రి మంత్రం వల్లె వేస్తూనే మరోవైపు గల్వాన్‌ లోయలో చైనా భారీ సంఖ్యలో సైనికులను మోహరిస్తోంది. అంతేకాకుండా మాటమార్చి తొలుత భారత సైనికులే తమను కవ్వించారని తప్పుదోవ పట్టించేలా మాటలు చెప్పింది. ఈ నేపథ్యంలో సైన్యాధిపతి నరవణె లద్దాఖ్‌, లెహ్‌ ప్రాంతాల్లో పర్యటించారు. చైనాను ఎదుర్కొనేందుకు భారత సన్నద్ధతను పరిశీలించారు. ఘర్షణలో డ్రాగన్‌ సైనికులతో పోరాడిన జవాన్లకు ప్రశంసా బ్యాడ్జీలు బహూకరించారు. సైన్యం పోరాట సన్నద్ధత గురించి ఆర్మీ చీఫ్‌ ప్రధానితో మాట్లాడతారని తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని