కరుడుగట్టిన  ఉగ్రవాది అబ్దుల్‌ మాలిక్‌ హతం

అల్‌ ఖైదా ఉత్తర ఆఫ్రికా చీఫ్‌ అబ్దుల్‌ మాలిక్‌ హతమయ్యాడు. మాలిలో తలదాచుకున్నట్లు ముందస్తు సమాచారం ...

Updated : 06 Jun 2020 14:46 IST

మాలి: కరుడుగట్టిన ఉగ్రవాది, అల్‌ ఖైదా ఉత్తర ఆఫ్రికా చీఫ్‌ అబ్దుల్‌ మాలిక్‌ హతమయ్యాడు. నార్త్‌ అల్జీరియాలోని పర్వత సానువుల్లో తలదాచుకున్నట్లు ముందస్తు సమాచారం అందడంతో ఫ్రెంచ్‌ బలగాలు స్థానిక సైన్యంతో కలిసి దాడులు నిర్వహించాయి. ఉత్తర మాలి, అల్జీరియా తదితర ప్రాంతాలల్లో ఏకకాలంలో దాడులు చేశాయి. ఈ దాడుల్లో అబ్దుల్‌ మాలిక్‌ ప్రాణాలు కోల్పోయినట్లు ఫ్రాన్స్‌ ప్రకటన విడుదల చేసింది. గత ఏడు సంవత్సరాలుగా మాలితోపాటు ఫ్రెంచ్‌ సైన్యాలు అబ్దుల్‌ మాలిక్‌ కోసం గాలిస్తున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు