హెయిర్‌ కట్‌ చేయించాలన్నా ఆధార్‌ తప్పనిసరి

ప్రభుత్వ పథకాలు, మొబైల్‌.. టీవీ కనెక్షన్ల వంటివి పొందడానికి ఆధార్‌ కార్డు తప్పనిసరన్న విషయం అందరికి తెలుసు. కానీ తమిళనాడు ప్రజలు సెలూన్‌లో జుట్టు కత్తించుకోవడానికి కూడా ఇప్పుడు ఆధార్‌ కార్డు తప్పనిసరైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

Updated : 06 Sep 2022 16:40 IST

తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు

చెన్నై: ప్రభుత్వ పథకాలు, మొబైల్‌.. టీవీ కనెక్షన్ల వంటివి పొందడానికి ఆధార్‌ కార్డు తప్పనిసరన్న విషయం అందరికి తెలుసు. కానీ తమిళనాడు ప్రజలకు సెలూన్‌లో జుట్టు కత్తించుకోవడానికి కూడా ఇప్పుడు ఆధార్‌ కార్డు తప్పనిసరైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌లో తాజాగా భారీ సడలింపులు ఇచ్చారు. ఈ క్రమంలో సెలూన్‌లు కూడా తెరుచుకునేందుకు అనుమతిచ్చారు. అయితే సెలూన్‌కు వచ్చే కస్టమర్ల వివరాలను యజమానులు సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. కస్టమర్‌ పేరు, చిరునామా, ఫోన్‌ నంబర్లతోపాటు ఆధార్‌ కార్డును తనిఖీ చేసి, ఆధార్‌ నంబర్‌ను రాసుకోవాలని సూచించింది. ఇందుకోసం రిజిస్టర్‌ సిద్ధం చేసుకోవాలని తెలిపింది. దీంతోపాటు సెలూన్‌, స్పా, బ్యూటీపార్లర్ల నిర్వహణకు పలు నిబంధనలు విధించింది. ‘‘50శాతం ఉద్యోగులతోనే షాప్‌ నిర్వహించాలి. మాస్కులు తప్పనిసరి. షాప్‌లో ఏసీని వాడకూడదు. కస్టమర్లు రాగానే ముందుగా వారి చేతులను శానిటైజ్‌ చేయాలి. అలాగే కస్టమర్‌ ఆరోగ్యసేతు యాప్‌ను పరిశీలించాలి’’అని ప్రభుత్వం తన నిబంధనల్లో పేర్కొంది. 

తమిళనాడు ప్రభుత్వం కూడా లాక్‌డౌన్‌ను జూన్‌ 30 వరకు పొడిగించింది. అయితే మే నెలలోనే గ్రామీణ ప్రాంతాల్లో సెలూన్‌ తెరుచుకోవచ్చని ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా సెలూన్‌ల పునఃప్రారంభానికి అనుమతిచ్చింది. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 23,495 కరోనా కేసులు నమోదు కాగా.. 10,141 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనాతో 184 మంది మరణించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని