చొరబాటుకు యత్నించిన ముగ్గురు ఉగ్రవాదులు హతం

భారత్‌లోకి చొరబడేందుకు యత్నించిన ముగ్గురు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పోలీసుల వివరాల ప్రకారం..

Published : 01 Jun 2020 14:39 IST

జమ్మూ: భారత్‌లోకి చొరబడేందుకు యత్నించిన ముగ్గురు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భారీ ఆయుధాలతో ముగ్గురు ముష్కరులు సోమవారం జమ్మూలోని నియంత్రణా రేఖ వెంబడి భారత్‌లోకి చొరబడేందుకు యత్నించారు. వీరు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి వస్తున్నట్లుగా గుర్తించిన భద్రతా బలగాలు.. సరిహద్దులోని కలాల్‌ గ్రామం వద్ద వీరిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ, ముష్కరులు కాల్పులకు తెగబడటంతో దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. దీంతో ముగ్గురు ఉగ్రవాదులు అక్కడికక్కడే హతమయ్యారు. ఆ సమయంలో వారి వద్ద భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. 

మరోవైపు భారీ నార్కో-టెర్రర్‌ మాడ్యూల్‌‌ను జమ్మూకశ్మీర్‌ పోలీసులు ఛేదించారు. సోమవారం ఉదయం ఆరుగురు నార్కో ఉగ్రవాదుల్ని అరెస్టు చేశారు. వీరికి జైషే మహ్మద్‌ సంస్థతో సత్సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. వీరి నుంచి భారీ స్థాయిలో మాదకద్రవ్యాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని