బ్రెజిల్‌లో 24 గంటల్లో 800 మరణాలు

లాటిన్‌ అమెరికాలోని బ్రెజిల్‌లో గత 24 గంటల్లో కొత్త కరోనా కేసులు 14,919 నమోదవ్వగా 800 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య అక్కడ 15,600 చేరిందని ఆరోగ్య మంత్రిత్వ...

Published : 17 May 2020 09:55 IST

శనివారం 14,919 కొత్త కేసులు

బ్రిసిలియా: బ్రెజిల్‌లో గత 24 గంటల్లో కొత్త కరోనా కేసులు 14,919 నమోదవ్వగా 800 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య అక్కడ 15,600 చేరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అదే సమయంలో మరో 2,300 వైరస్‌ అనుమానిత మరణాలు సంభవించాయని చెప్పింది. కొత్తగా నమోదైన కేసులను కలిపితే బ్రెజిల్‌లో బాధితుల సంఖ్య 2,33,142కు చేరిందని ఆరోగ్య శాఖ ప్రకటించింది. అంతకుముందు రోజు సైతం 15000 వేలకు పైగా కొత్త కేసులు నమోదవ్వగా, 800 మందికిపైగా మృతిచెందారు.

బ్రెజిల్‌లో ఒకవైపు కొత్త కేసులు అధికంగా నమోదవుతుంటే మరోవైపు ఆరోగ్య మంత్రిత్వ శాఖలో అస్థిరత్వం ఏర్పడింది. నెల రోజుల్లోనే ఆ శాఖలో ఇద్దరు మంత్రులు వైదొలిగారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనే క్రమంలో బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్‌ బొల్సొనారో తీసుకుంటున్న నిర్ణయాలే అందుకు కారణం. దేశంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభించేందుకు బొల్సొనారో తాజాగా పలు వ్యాపార సంస్థలకు ఆంక్షలు సడలించిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడి నిర్ణయాలను ఆరోగ్య శాఖ మంత్రి నెల్సన్‌ టీచ్‌ వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. ఇక ఏప్రిల్‌లోనూ గత ఆరోగ్య మంత్రి లూయిజ్‌ హెన్రిక్‌ మాన్‌డెట్టా అధ్యక్షుడి నిర్ణయాలను కొన్నింటిని వ్యతిరేకించడంతో ఆయనను తొలగించారు. 

ఇవీ చదవండి:

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని