ఏసీ కోచ్‌ల వల్ల కరోనా వ్యాపించదు: రైల్వేశాఖ

లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపులో భాగంగా రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం నుంచే ఈ రైళ్లు పరుగులు

Published : 13 May 2020 01:55 IST

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపులో భాగంగా రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం నుంచే ఈ రైళ్లు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రయాణీకులకు రైల్వేశాఖ అనేక సూచనలు చేసింది. అయినా ప్రయాణీకుల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏసీ బోగీల్లో ప్రయాణించేవారికి కరోనా వైరస్‌ వ్యాప్తిస్తుందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలా ఎన్నో అనుమానాలు. రైల్వేశాఖ వీటిపై స్పష్టత ఇచ్చింది.

ఏసీ కోచ్‌ల్లో ప్రయాణించడం వల్ల కరోనా వ్యాపించదని తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ‘ఆరోగ్య మంత్రిత్వశాఖ మార్గనిర్దేశాలు ఏం చెబుతున్నాయంటే, సెంట్రలైజ్డ్‌ ఏసీ ప్రదేశంలో గాలి ఎప్పటికప్పుడు పూర్తిగా మారిపోతుంది. ఏసీ బోగీల్లో గాలి ప్రతి గంటకూ దాదాపు 12సార్లు మారిపోతుంటుంది. ది రూఫ్‌ మౌంటెడ్‌ ఏసీ ప్యాకేజ్‌ యూనిట్‌(ఆర్‌ఎంపీయూ) సిస్టమ్‌ ఆఫ్‌ ఇండియన్‌ రైల్వేస్‌ ఏసీ కోచ్‌లను ప్రత్యేకంగా డిజైన్‌ చేయించారు. ఇది అత్యధిక సార్లు స్వచ్ఛమైన గాలి లోపలికి పంపిస్తుంది’’ అని అధికారులు తెలిపారు. గతంలో ఆర్‌ఎంపీయూ వ్యవస్థ గంటకు 5సార్లు మాత్రమే పూర్తిగా గాలిని మార్చేసేది. కానీ, దాన్ని ఇప్పుడు మార్చారు.

ప్రస్తుతం నడుపుతున్న ప్రత్యేక రైళ్లలో ప్రయాణీకులెవరికీ దుప్పట్లు ఇవ్వరు. అదే విధంగా ఉష్ణోగ్రత 23 డిగ్రీల నుంచి 25 డిగ్రీల మధ్య ఉండేలా చూస్తున్నారు. భద్రమైన ప్రయాణం కోసం రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని