రైల్వే ప్రయాణికులకు శుభవార్త

కరోనా వైరస్‌ కారణంగా ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. దేశ వ్యాప్తంగా బస్సులు, రైళ్లు, విమాన రాకపోకలు నిలిచిపోయాయి. తాజాగా లాక్‌డౌన్‌ మూడోసారి

Updated : 10 May 2020 22:41 IST

రేపటి నుంచి బుకింగ్‌లు

న్యూదిల్లీ: కరోనా వైరస్‌ కారణంగా ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. దేశ వ్యాప్తంగా బస్సులు, రైళ్లు, విమాన రాకపోకలు నిలిచిపోయాయి. తాజాగా లాక్‌డౌన్‌ మూడోసారి మే 17వరకూ పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇస్తోంది. ఇప్పటికే వలస కూలీలను శ్రామిక్‌ రైళ్ల ద్వారా వారి గమ్య స్థానాలకు చేరుస్తోంది. తాజాగా మే 12వ తేదీ నుంచి దశల వారీగా పాసింజర్‌ రైళ్లను కూడా నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. దిల్లీ నుంచి 15 సర్వీసులను ప్రత్యేక రైళ్లుగా దేశంలోని 15 ముఖ్య నగరాలకు నడపనున్నారు.

దిల్లీ నుంచి ఇతర ప్రాంతాలకు(15 రైళ్లు) అక్కడి నుంచి నుంచి దిల్లీకి(15 రైళ్లు) మొత్తం 30 రైళ్లను నడపాలని నిర్ణయించారు. దిల్లీ నుంచి దిబ్రూఘర్‌, అగర్తలా, హౌరా, పట్నా, బిలాస్‌పూర్‌, రాంచీ, భువనేశ్వర్‌, సికింద్రాబాద్‌, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడ్‌గావ్‌, ముంబయి సెంట్రల్‌, అహ్మదాబాద్‌, జమ్మూతావిలకు అక్కడి నుంచి దిల్లీకి ఈ రైళ్లు తిరగనున్నాయి. దీని తర్వాత రైల్వే కోచ్‌లు అందుబాటులో ఉన్న దానిని బట్టి ప్రత్యేక రైళ్లు నడిపే విషయమై నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే 20వేల కోచ్‌లను కొవిడ్‌-19 కేర్‌ సెంటర్లుగా మార్చిన సంగతి తెలిసిందే. మరోవైపు రోజూ 300 శ్రామిక్‌ రైళ్లను రైల్వేశాఖ నడుపుతోంది.

ఇక పాసింజర్‌ రైళ్లలో రిజర్వేషన్లు మే 11వ తేదీ సాయంత్రం 4గంటల నుంచి మొదలవుతాయి. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో టికెట్లు రిజర్వేషన్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి రైల్వే రిజర్వేషన్‌ కౌంటర్లను మూసే ఉంచుతారు. కన్ఫార్మ్‌ అయిన టికెట్లు కలిగిన ప్రయాణికులకు మాత్రమే రైల్వే స్టేషన్‌లోకి అనుమతి ఉంటుంది. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్‌, ధరించి, స్క్రీనింగ్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ప్రయాణానికి అనుమతి ఇస్తారు. కరోనా లక్షణాలు లేని వారికి మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని