సైనికుల కోసం ప్రత్యేక రైళ్లు.... 

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నిబంధనలు అమలులో ఉన్న కారణంగా అన్ని రకాల ప్రజా రవాణా సదుపాయాల్ని ఆయా శాఖలు నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో బెంగళూరు, బెళగావి, సికింద్రాబాద్, గోపాల్‌పురలోని శిక్షణ కేంద్రాల్లో ఉన్న సైనికులను ఉత్తర, ఈశాన్య సరిహద్దులకు...... 

Updated : 16 Apr 2020 19:30 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నిబంధనలు అమలులో ఉన్న కారణంగా అన్ని రకాల ప్రజా రవాణా సదుపాయాల్ని ఆయా శాఖలు నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో బెంగళూరు, బెళగావి, సికింద్రాబాద్, గోపాల్‌పురలోని శిక్షణ కేంద్రాల్లో ఉన్న సైనికులను ఉత్తర, ఈశాన్య సరిహద్దులకు తరలించేందుకు రెండు ప్రత్యేక రైళ్లు నడపాలని రైల్వే శాఖను కోరినట్లు భారత సైన్యం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అనుమతులు మంజూరు చేసినట్లు సమాచారం. ‘‘ఉత్తర, ఈశాన్య సరిహద్దుల్లో కార్యకలాపాల నిర్వహణ కోసం వివిధ ప్రాంతాల్లోని సైనికులను ఆయా సరిహద్దులకు తరలించేందుకు రైల్వే శాఖ సాయంతో రెండు ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించాం. ఇందులో భాగంగా మొదటి రైలు ఏప్రిల్ 17న బెంగళూరు నుంచి బయల్దేరి జమ్మూకు చేరుకుంటుంది. రెండో రైలు ఏప్రిల్ 18న బెంగళూరు నుంచి గువహటికి బయల్దేరుతుంది. సరిహద్దుల్లో మొహరించిన బలగాల సన్నద్ధతకు ఇది ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా ఉత్తర, ఈశాన్య సరిహద్దుల్లో మొహరించిన సిబ్బందిలో ఎవరైనా క్వారంటైన్‌లోఉండి తిరిగి విధుల్లో చేరితే వారికి ప్రత్యేక వసతి కల్పించేందుకు ఏర్పాట్లు చేశాం’’ అని భారత సైన్యం తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని