కేరళలో గృహహింసపై ఫిర్యాదుకు వాట్సాప్‌ నంబరు

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ నేపథ్యంలో గృహహింసపై ఫిర్యాదు చేసేందుకు కేరళ ప్రభుత్వం వాట్సాప్‌ నంబరును ఏర్పాటు చేసింది. లాక్‌డౌన్‌ కారణంగా ..

Updated : 11 Apr 2020 19:42 IST

తిరువనంతపురం : దేశవ్యాప్త లాక్‌డౌన్‌ నేపథ్యంలో గృహహింసపై ఫిర్యాదు చేసేందుకు కేరళ ప్రభుత్వం వాట్సాప్‌ నంబరును ఏర్పాటు చేసింది. లాక్‌డౌన్‌ కారణంగా గృహహింస కేసులు పెరుగుతున్నందున నివారణ చర్యలు తీసుకోవాలని సామాజిక న్యాయ విభాగం కేరళ ప్రభుత్వాన్నికోరింది. స్త్ర్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ వాట్సాప్‌ నంబర్‌ 24 గంటలు అందుబాటులో ఉంటుందని ముఖ్యమంత్రి  పినరయ్‌ విజయన్‌ తెలిపారు. ఈ నంబరుతోపాటు బాలల సంబంధిత ఫిర్యాదు నంబరు, స్త్ర్రీలకు సంబంధించి ఫిర్యాదులు చూసే ఇతర విభాగాలకైనా ఫోన్‌ చేయవచ్చని  ప్రభుత్వం తెలిపింది. గృహహింస కేసుల కోసం జాతీయ మహిళా కమిషన్ కూడా వాట్సాప్‌ నంబరును ఏర్పాటు చేసింది.  మార్చి 23 నుంచి ఈ నెల 10 వరకు 123 గృహహింస కేసులు జాతీయ మహిళా కమిషన్‌ దృష్టికి వచ్చినట్లు అధికారులు తెలిపారు.

 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని