వుహాన్‌ ప్రజల్లో రగులుతున్న అశాంతి!

కరోనా వైరస్‌ పుట్టినిల్లు వుహాన్‌లో అశాంతి రగులుతోంది! ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. 80 రోజుల లాక్‌డౌన్‌ ఫలితంగా వుహాన్‌లో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. ఈ నేపథ్యంలో అక్కడి ఓ అతిపెద్ద షాపింగ్‌ మాల్‌ గ్రాండ్‌ ఓషన్‌ డిపార్ట్‌మెంట్‌ స్టోర్‌ ముందు చిన్న దుకాణాదారులు నిరసన వ్యక్తం చేశారు.....

Published : 10 Apr 2020 18:58 IST

అద్దె రద్దు చేయాలని కోరుతున్న చిన్న దుకాణాదారులు

దిల్లీ: కరోనా వైరస్‌ వెలుగుచూసిన వుహాన్‌లో అశాంతి రగులుతోంది! ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. 80 రోజుల లాక్‌డౌన్‌ ఫలితంగా వుహాన్‌లో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. ఈ నేపథ్యంలో అక్కడి ఓ అతిపెద్ద షాపింగ్‌ మాల్‌ గ్రాండ్‌ ఓషన్‌ డిపార్ట్‌మెంట్‌ స్టోర్‌ ముందు చిన్న దుకాణాదారులు నిరసన వ్యక్తం చేశారు. మాస్క్‌లు ధరించి ఒకరికొకరు కనీసం మీటరు దూరం కూర్చొన్నారు. ‘ఏడాది పాటు అద్దెను మినహాయించండి లేదా సెక్యూరిటీ డిపాజిట్‌ తిరిగిచ్చేయండి’ అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. వీరిపై పోలీసులు నిఘా పెట్టారు.

లాక్‌డౌన్‌ కాలానికి అద్దె మినహాయింపు ఇవ్వాలని లేదా డిపాజిట్‌ తిరిగిచ్చేయాలని ఓ మహిళ కోరింది. లేదంటే మనుగడ సాగించలేమని తెలిపింది. తామంతా చిన్న చిన్న దుకాణాలు నడుపుకొనేవాళ్లమని ఆవేదన వ్యక్తం చేసింది. ‘నిన్నటి నిరసనకు ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పుడు పోలీసులు దాడి చేస్తున్నారు’ అని మరొకరు తెలిపారు.

ప్రస్తుతం చైనా విపత్కర పరిస్థితుల్లో చిక్కుకుంది. ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం కోల్పోవడంతో ప్రజలు అశాంతితో రగులుతున్నారు. అమెరికా సహా ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి నెలకొంది. అంతకుముందు హుబెయ్‌ ప్రావిన్స్‌ నుంచి ప్రజలు సరిహద్దులు దాటి రావడానికి పక్కనే ఉన్న జియాగ్‌షి అధికారులు అంగీకరించలేదు. హుబెయ్‌ పోలీసులతో వారు ఘర్షణకు దిగారు. ఈ వీడియోలు అక్కడి సోషల్‌ మీడియా విబోలో వైరల్‌ అయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు