విదేశీ ప్రయాణికులపై నిషేధంలేదు: జైశంకర్
కరోనా (కొవిడ్-19) వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్‌లోకి విదేశీ ప్రయాణికుల ప్రవేశంపై ఎలాంటి నిషేధం విధించలేదని తెలిపింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్. జైశంకర్ ఒక.....
దిల్లీ: కరోనా (కొవిడ్-19) వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు భారత్‌లోకి విదేశీ ప్రయాణికుల ప్రవేశంపై ఎలాంటి నిషేధం విధించలేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్. జైశంకర్ ఒక ప్రకటన చేశారు. ‘‘కొన్ని దేశాల నుంచి భారత్‌కు వచ్చే విదేశీయులు క్వారంటైన్‌కు వెళ్లవలసి ఉంటుంది. అయితే, ఇది కొన్ని సార్లు కచ్చితంగా, ఇంకొన్ని సార్లు ప్రయాణికుల ఇష్టం మేరకు ఉంటుంది. స్వదేశానికి తిరిగి వచ్చే భారతీయులు మాత్రం క్వారంటైన్‌కి రావాలి’’ అని తెలిపారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆర్ఎస్పీ సభ్యుడు ఎన్కే ప్రేమ్‌చంద్రన్, ‘‘భారత్ మాత్రమే పూర్తి స్థాయిలో నిషేధం విధించిన దేశం’’ అన్న వ్యాఖ్యలకు బదులుగా మంత్రి ఈ ప్రకటన చేశారు.
వారికి ముందు అవకాశం
ఇటలీ, ఇరాక్‌లో చిక్కుకొన్న భారతీయులకు పరీక్షల్లో కరోనా నెగటివ్ అని తేలితేనే వారిని స్వదేశానికి తీసుకువస్తామని కేంద్ర విదేశాంగశాఖ తెలిపింది. ‘‘శుక్రవారం భారతీయ వైద్యుల బృందం ఇటలీ చేరుకొంది. అక్కడి భారతీయ విద్యార్థులు కరోనా నెగటివ్ ధ్రువీకరణ పత్రాలు పొందడంలో ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారిస్తారు. అక్కడి వారికి పరీక్షలు నిర్వహించి కరోనా నెగటివ్ వచ్చిన వారికి వైద్యులు ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తారు. దాని వల్ల వారిలో కొందరు కమర్షియల్ విమానాల్లో ప్రయాణించవచ్చు’’ అని విదేశాంగశాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు. భూటాన్, మాల్దీవులు, ఇరాన్ నుంచి కూడా మాస్కుల కోసం వినతులు వచ్చాయని, వారికి సహాయం చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు.
అయితే భారతీయులను స్వదేశానికి తరలించే విషయంలో కరోనా నెగటివ్ వ్యక్తులను మాత్రమే ముందు తీసుకొస్తామని కరోనా నోడల్ అధికారిగా నియమించిన విదేశాంగశాఖ అదనపు కార్యదర్శి దమ్ము రవి తెలిపారు. ‘‘ఇరాన్‌కు ఇప్పటికే ఒక వైద్యుల బృందం వెళ్లింది. అక్కడి నుంచి రక్త నమూనాలు వివిధ దశల్లో భారత్‌కు చేరుకుంటాయి. వాటిని పరీక్షించి కరోనా నెగటివ్ ఉన్న వ్యక్తులను మాత్రం ముందుగా భారత్‌కు తరలిస్తాం’’ అని తెలిపారు. దాదాపు 6000 మంది యాత్రికులు ఇరాన్‌లోని వేర్వేరు ప్రావిన్సుల్లో చిక్కుకుపోయారు. అయితే వీరిలో 120 మందిని ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో శుక్రవారం భారత్‌కు తీసుకురానున్నారు. వీరిని రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఆర్మీ ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు తరలించనున్నారు. మరో 250 మంది భారతీయులను మార్చి 14న స్వదేశానికి తీసుకురానున్నారు.
కరోనా భారత్‌లో విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా అనవసర ప్రయాణాలను మానుకోవాలని సూచించింది. దానితోపాటు కొన్ని దేశాలకు ఇ-వీసా, ఆగమానంతర వీసా సదుపాయాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పటి వరకు భారత్‌లో కరోనా సోకిన వారి సంఖ్య 74కి చేరింది. తాజాగా మంగళవారం మరణించిన 70 ఏళ్ల వ్యక్తి కరోనాతో మృతి చెందినట్లు నిర్ధారణ అయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
క్రికెట్ అభిమానులు జాగ్రత్తగా ఉండండి..! చెన్నై ఆటగాడు ధోనీ (MS Dhoni) పేరుతో ఓ ఇన్‌స్టా మెసేజ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. -
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
పట్నాలోని ఓ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. -
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
Students smile: విద్యార్థులంటే పుస్తకాలు ముందేసుకొని, టీచర్లు చెప్పే పాఠాలు వినడమే గుర్తుకువస్తుంది. కానీ ఆన్లైన్లో వైరల్‌గా మారిన ఓ వీడియో మాత్రం అందుకు భిన్నంగా ఆకట్టుకుంటోంది. -
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్‌పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్‌ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్‌కు క్లీన్చిట్
లోక్‌సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్‌కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్‌లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్‌కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్‌డే!
ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్‌గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్‌జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM