దిల్లీ అల్లర్లు: తాహిర్‌ హుస్సేన్‌పై ఈడీ కేసు!

ఈశాన్య దిల్లీ అల్లర్లలో ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ) అధికారి అంకిత్‌ శర్మ హత్య విషయంలో అరెస్టయిన తాహిర్‌ హుస్సేన్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కేసు నమోదు చేసింది..........

Published : 12 Mar 2020 01:00 IST

దిల్లీ: ఈశాన్య దిల్లీ అల్లర్లలో ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ) అధికారి అంకిత్‌ శర్మ హత్య కేసులో అరెస్టయిన తాహిర్‌ హుస్సేన్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కేసు నమోదు చేసింది. ఇస్లామిస్ట్‌ గ్రూప్‌ పాపులర్‌ ఫ్రంట్‌ ఇఫ్‌ ఇండియా(పీఎఫ్‌ఐ)పైనా కేసు మోపారు. అల్లర్లకు నిధులు సమకూర్చారన్న ఆరోపణల నేపథ్యంలోనే ఈడీ చర్యలకు ఉపక్రమించింది. దీంతో అతనిపై నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అతడు దిల్లీ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. గత నెల ఈశాన్య దిల్లీలో సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఘటనల్లో దాదాపు 50 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ స్థాయిలో ఆస్తి నష్టం సంభవించింది. ఈ అల్లర్లను తాహిర్‌ హుస్సేనే ప్రోత్సహించినట్ల ఆరోపణలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని