లోక్‌సభ ముందుకు ‘దిల్లీ అల్లర్లు’

పార్లమెంట్‌ రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. కాగా.. ఈ సమావేశాల్లో ఈశాన్య దిల్లీ అల్లర్ల ఘటనను లేవనెత్తేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఈ అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్‌ లోక్‌సభా పక్ష నేత అధిర్‌ రంజన్‌

Published : 02 Mar 2020 10:37 IST

దిల్లీ: పార్లమెంట్‌ రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. కాగా.. ఈ సమావేశాల్లో ఈశాన్య దిల్లీలో అల్లర్ల అంశాన్ని లేవనెత్తేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఈ అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్‌ లోక్‌సభా పక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌధురీ సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని హస్తం పార్టీ డిమాండ్‌ చేస్తోంది. అటు శివసేన, తృణమూల్‌ కాంగ్రెస్‌,ఏఐఎంఐఎం, డీఎంకే తదితర పార్టీలు కూడా వేర్వేరుగా నోటీసులిచ్చాయి. దిల్లీ అల్లర్లపై లోక్‌సభకు మొత్తంగా 23 నోటీసులు వచ్చాయి.

మరోవైపు దిల్లీ అల్లర్లను నిరసిస్తూ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీలు నేడు పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. ఈశాన్య దిల్లీలో ఇటీవల ఉద్రిక్త ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ అల్లర్లలో 46 మంది ప్రాణాలు కోల్పోయారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని