వదంతులతో వణికిన దిల్లీ..!

దేశ రాజధాని దిల్లీలో మరోసారి అల్లర్లు జరుగుతున్నాయన్న వదంతులు ఆదివారం సాయంత్రం భారీ ఎత్తున వ్యాపించాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. గత వారం జరిగిన అల్లర్ల నేపథ్యంలో తాజాగా..........

Updated : 02 Mar 2020 15:30 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో మరోసారి అల్లర్లు జరుగుతున్నాయన్న వదంతులు ఆదివారం సాయంత్రం భారీ ఎత్తున వ్యాపించాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. గత వారం జరిగిన అల్లర్ల నేపథ్యంలో తాజాగా మరోసారి ఘర్షణలు తలెత్తుతున్నాయన్న అసత్య ప్రచారాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. తీవ్ర ఆందోళనకు గురైన ప్రజలు పోలీసులకు సమాచారం అందజేశారు. వందల సంఖ్యలో కంట్రోల్‌ రూంకు కాల్స్‌ వచ్చినట్లు అధికారులు చెప్పారు. అయితే, అవన్నీ తప్పుడు కాల్స్‌ అని తేల్చారు. వదంతుల నేపథ్యంలో కొన్ని గంటల పాటు ఏడు మెట్రో స్టేషన్లను మూసివేశారు. అవన్నీ అసత్యప్రచారాలని ధ్రువీకరించిన పోలీసులు ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావొద్దని పిలుపునిచ్చారు. నగరవ్యాప్తంగా ప్రశాంత వాతావరణం ఉందని వెల్లడించారు. ఈ తప్పుడు సందేశాలు ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు. మరోవైపు గతవారం జరిగిన అల్లర్లలో గాయపడ్డ మరో నలుగురు మృతిచెందినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. దీంతో ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 46కు చేరింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని