దేశంలో శాంతికి నా వంతు పాత్ర పోషిస్తా: రజినీ

దేశంలో శాంతి, సామరస్యాన్ని నెలకొల్పేందుకు తన వంతు పాత్ర పోషించడానికి తానెప్పుడూ సిద్ధంగా ఉంటానని సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ అన్నారు. దిల్లీలో ఇటీవల జరిగిన ఘర్షణలను ఖండించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.........

Updated : 02 Mar 2020 12:27 IST

చెన్నై: దేశంలో శాంతి, సామరస్యాన్ని నెలకొల్పేందుకు తన వంతు పాత్ర పోషించడానికి తానెప్పుడూ సిద్ధంగా ఉంటానని సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ అన్నారు. దిల్లీలో ఇటీవల జరిగిన ఘర్షణలను ఖండించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అంతకుముందు రజనీకాంత్‌తో పలువురు ముస్లిం మత పెద్దలు  ఆదివారం భేటీ అయ్యారు. అనంతరం ట్విటర్ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘దేశంలో శాంతిని పెంపొందించేదుకు నా వంతు పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నాను. దేశంలో ప్రేమ, సమైక్యత, శాంతిని నెలకొల్పడమే ప్రజల తొలి ప్రాధాన్యంగా ఉండాలన్న ముస్లిం సోదరుల అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను’’ అని ట్వీట్‌ చేశారు. 

ఈశాన్య దిల్లీ ఘటనలపై గతవారం రజినీకాంత్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఘర్షణల్ని అదుపు చేయడంలో కేంద్రం తీరును ఆయన తప్పుబట్టారు. హింస ఆపలేని వారు తమ పదవులకు రాజీనామా చేయాలంటూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని