Published : 28/02/2020 00:22 IST

దిల్లీ ఘర్షణలపై అమెరికా ఆందోళన 

మృతుల కుటుంబాలకు సానుభూతి

దిల్లీ: ఈశాన్య దిల్లీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో 30 మందికి పైగా మృతిచెందడంపై అగ్రరాజ్యం అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. దిల్లీలో శాంతియుత పరిస్థితులు నెలకొనేలా చూడాలని అన్ని పార్టీలను కోరింది. ఈ మేరకు యూఎస్‌ బ్యూరో ఆఫ్‌ సౌత్‌, సెంట్రల్‌ ఏషియన్‌ అఫైర్స్‌ ట్విటర్‌ వేదికగా స్పందించింది. 

దిల్లీ ఘటనలపై ప్రధాని మోదీ నిన్న స్పందించిన విషయం తెలిసిందే. రాజధాని ప్రజలు సోదరభావంతో మెలగాలని, శాంతి భద్రతలు కాపాడేందుకు కృషి చేయాలని మోదీ ట్విటర్‌ వేదికగా పిలుపునిచ్చారు. ప్రధాని ట్వీట్‌ను రీట్వీట్‌ చేసిన అమెరికా బ్యూరో.. దిల్లీ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన వారి, క్షతగాత్రుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. ‘శాంతియుత పరిస్థితుల కోసం భారత ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును మేం పునరుద్ఘాటిస్తున్నాం. దిల్లీలో హింసను అరికట్టి ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాలని అన్ని పార్టీలను కోరుతున్నాం’ అని ట్విటర్‌లో పేర్కొంది. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని