మరో 118 మంది కరోనాకు బలి

కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 2,233కు చేరింది. గురువారం మరో 115 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అత్యధిక మంది హుబెయ్‌ ప్రావిన్సుకు చెందినవారే............

Updated : 21 Feb 2020 12:18 IST

బీజింగ్‌: కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 2,236కు చేరింది. గురువారం మరో 118 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అత్యధిక మంది హుబెయ్‌ ప్రావిన్సుకు చెందినవారే. ఇక వైరస్‌ బాధితుల సంఖ్య 75,400 దాటింది. కొత్తగా మరో 889 మందిలో వైరస్‌ జాడను గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. బుధవారంతో పోలిస్తే ఈ సంఖ్య కాస్త పెరిగినప్పటికీ... వైరస్‌ వ్యాప్తి బారీగా తగ్గుముఖం పట్టడం ఊరట కలిగిస్తోంది. అయితే వైరస్‌ సోకిన వారిని గుర్తించేందుకు తొలినాళ్లలో అనుసరించిన విధానాన్నే తిరిగి అమల్లోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. టెస్టుల్లో పాజిటివ్‌ అని తేలితేనే బాధితుల కింద పరిగణిస్తున్నారు. ఇంతకుముందు వైరస్‌ లక్షణాలు ఏమాత్రం కనిపించినా వారందర్నీ మహమ్మారి బారినపడ్డట్లుగా లెక్కగట్టారు. తిరిగి పాత విధానంలోకి మారడం వల్లే నమోదిత బాధితుల సంఖ్య తగ్గినట్లు తెలుస్తోంది.

* జపాన్‌ నౌకలో ఉన్న భారతీయుల్లో మరో వ్యక్తి వైరస్‌ బారినపడ్డట్లు గుర్తించారు. దీంతో ఇప్పటివరకు నౌకలో వైరస్ సోకిన భారతీయుల సంఖ్య ఎనిమిదికి చేరింది. 

* దక్షిణ కొరియాలో మరో 52 మందికి వైరస్‌ సోకింది. దీంతో బాధితుల సంఖ్య 156కు చేరింది.

* వుహాన్‌లో ఉన్న ఉక్రెయిన్‌వాసులను ఆ దేశం గురువారం సొంతగడ్డకు తీసుకెళ్లింది. వీరిని 14 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచడానికి మారుమూల ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఓ కేంద్రానికి తరలించారు. ఈ క్రమంలో వైరస్‌ ఎక్కడ తమకు వ్యాపిస్తుందోనన్న భయంతో స్థానికులు బాధితుల్ని తరలిస్తున్న బస్సుపై రాళ్లు రువ్వారు. వారిని అదుపుచేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులుపైనా దాడికి దిగారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎట్టకేలకు భారీ భద్రత మధ్య వారిని ప్రత్యేక కేంద్రానికి తరలించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని