చైనాపై ట్రంప్‌ ప్రశంసలు

పంచాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా వైరస్ కట్టడికి చైనా చేస్తున్న పోరాటాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ప్రశంసించారు. డ్రాగన్‌ దేశానికి తమ వంతు సహకారాన్ని అందిస్తున్నామని తెలిపారు.......

Updated : 08 Feb 2020 12:11 IST

వాషింగ్టన్‌: ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా వైరస్ కట్టడికి చైనా చేస్తున్న పోరాటాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ప్రశంసించారు. డ్రాగన్‌ దేశానికి తమ వంతు సహకారాన్ని అందిస్తున్నామని తెలిపారు. చైనాలో పరిస్థితుల్ని అధ్యక్షుడు షీ జిన్‌ పింగ్‌ని అడిగి తెలుసుకున్నానన్నారు. కరోనా ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎలా ఉండబోతోందన్న ప్రశ్నకు స్పందిస్తూ.. చైనా పటిష్ఠ చర్యలు తీసకుంటుందని వ్యాఖ్యానించారు. పరోక్షంగా డ్రాగన్ దేశం అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ముందుగానే జాగ్రత్త పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికాలో ఇప్పటివరకు 12 మందికి ఈ వైరస్‌ సోకినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో చైనా ప్రయాణాలపై అగ్రరాజ్యం ఆంక్షలు విధించింది. వైరస్‌పై పోరులో భాగంగా ప్రపంచస్థాయి నిపుణుల్ని పంపేందుకు అమెరికా ముందుకు వచ్చిందని అక్కడి అధికారులు తెలిపారు.  

అంతకుముందు వీరివురి సంభాషణ సమాచారాన్ని మీడియాకు వివరించిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌.. కరోనా వైరస్‌ వ్యాప్తిని, తదనంతర పరిస్థితిని ప్రశాంత చిత్తంతో, సహేతుకంగా చూడాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలను, ప్రారంభించిన ‘పీపుల్స్‌ వార్‌’ను గమనించాలని కోరారు. వైరస్‌ సోకుతుందనే భయంతో విమాన సేవల్ని రద్దు చేయడంపై వివిధ దేశాల రాయబారుల వద్ద చైనా నిరసనలు తెలిపింది. ఈ చర్య ప్రపంచ ఆరోగ్యసంస్థ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉందంది. వైరస్‌ భయంతో పలు దేశాలు తమవద్దకు ప్రయాణికుల నౌకల్ని రానివ్వడం లేదు.

ఇవీ చదవండి: చైనాలో కొనసాగుతన్న మృత్యుఘోష
             
అలుగుతో కరోనా వైరస్‌ వ్యాప్తి!

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని