అక్కడ జనాభా కంటే.. ఆధార్‌ కార్డులే ఎక్కువ

దిల్లీ: ప్రస్తుతం ప్రతీదానికి ఆధార్‌ కార్డు అవసరం. బ్యాంకు ఖాతా తెరిచే దగ్గర నుంచి ప్రభుత్వ పథకాలు అమలయ్యేంత వరకు అన్నింటికీ ఆధార్‌ తప్పనిసరి. ప్రతి ఒక్కరికీ ఆధార్‌ కార్డు ఉంటుంది. కొంతమందైతే అప్పుడే పుట్టిన శిశువులకు కూడా ఆధార్‌ తీసుకుంటున్నారు. అంతగా ఆధార్‌

Updated : 06 Sep 2022 16:41 IST

దిల్లీ: ప్రస్తుతం ప్రతీదానికి ఆధార్‌ కార్డు అవసరం. బ్యాంకు ఖాతా తెరిచే దగ్గర నుంచి ప్రభుత్వ పథకాలు అమలయ్యేంత వరకు అన్నింటికీ ఆధార్‌ తప్పనిసరి. ప్రతి ఒక్కరికీ ఆధార్‌ కార్డు ఉంటుంది. కొంతమందైతే అప్పుడే పుట్టిన శిశువులకు కూడా ఆధార్‌ తీసుకుంటున్నారు. అంతగా ఆధార్‌ ముఖ్యమైపోయింది. అయితే.. కొన్ని  రాష్ట్రాల్లో జనాభా కంటే ఆధార్‌ కార్డులే ఎక్కువగా ఉన్నాయట. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ఐటీశాఖ సహాయమంత్రే చెప్పారు. ఏ రాష్ట్రంలోనైనా జనాభా కంటే ఆధార్‌ కార్డులు ఎక్కువగా ఉన్నాయా అని వేసిన ప్రశ్నకు కేంద్రమంత్రి సంజయ్‌ థోత్రీ సమాధానమిస్తూ ఈ విషయాన్ని చెప్పారు. 

జనాభా గణన చేయడం లేదా అక్కడి ప్రజలు వేరే ప్రాంతాలకు వలస వెళ్లడం వల్ల ఇలా జరిగి ఉండొచ్చని ఆయన రాజ్యసభకు తెలియజేశారు. ‘అవును.. ఉన్నాయ్‌. డిసెంబరు 31, 2019 నాటి అంచనా ప్రకారం ఏడు రాష్ట్రాల్లో జనాభా కంటే ఆధార్‌ కార్డులే ఎక్కువగా ఉన్నాయి’ అని ఆయన జవాబిచ్చారు. చనిపోయిన వారి ఆధార్‌ కార్డులు తొలగించకపోవడం వల్ల ఇలా జరగలేదని ఆయన వెల్లడించారు. అయితే ఆ ఏడు రాష్ట్రాలు ఏవి అనే విషయాన్ని మాత్రం కేంద్రమంత్రి చెప్పలేదు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని