Updated : 29/01/2020 04:43 IST

కరేబియన్‌ దీవుల్లో భూకంపం: సునామీ హెచ్చరిక

క్యూబా: కరేబియన్‌ దీవుల్లో భూకంపం సంభవించింది. జమైకా, క్యూబా, కేమన్‌ దీవుల మధ్య సముద్రంలో 10 కి.మీ దూరంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 7.7గా నమోదైంది. దీంతో యునైటెడ్‌ స్టేట్స్‌ జియోలాజికల్‌ సర్వే(యూఎస్‌జీఎస్‌), అంతర్జాతీయ సునామీ కేంద్రం క్యూబా, జమైకా, కేమన్‌ దీవులకు సునామీ హెచ్చరికలు జారీ చేశాయి. భూకంప తీవ్రతకు దీవుల్లోని పలు భవనాలు కదిలాయి. ఇంతవరకు ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. భూకంప కేంద్రంగా సముద్ర తీర ప్రాంతాల్లో 300కి.మీ వరకు సునామీ తరంగాలు వస్తున్నాయని పసిఫిక్‌ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. సునామీ ప్రభావం క్యూబా, హోండూరస్‌, మెక్సికో, కేమన్‌ దీవులు, బెలిజ్‌, జమైకాలోని పలు ప్రాంతాల్లో ఉండనున్నట్లు సునామీ హెచ్చరిక కేంద్రం పేర్కొంది. తీర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేమన్‌ దీవుల్లోని ప్రభుత్వం తెలిపింది. 
 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని