సీజేఐ, స్పీకర్‌కు భద్రత పెంపు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు భద్రత పెంచారు. వీరికి జెడ్‌ కేటగిరీ భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఇచ్చిన

Updated : 29 Jan 2020 11:24 IST

దిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు భద్రత పెంచారు. వీరికి జెడ్‌ కేటగిరీ భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఇచ్చిన నివేదిక ఆధారంగా సీజేఐ, స్పీకర్‌కు భద్రత పెంచుతూ హోంశాఖ నిర్ణయం తీసుకుంది. 

లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఇప్పటివరకు సీఐఎస్‌ఎఫ్‌ భద్రత ఉండేది. ప్రస్తుతం దాన్ని జెడ్‌ కేటగిరీకి పెంచారు. ఇకపై సీఆర్పీఎఫ్‌ సిబ్బంది బిర్లాకు రక్షణ కల్పించనున్నారు. అటు సీజేఐ జస్టిస్‌ బోబ్డేకు కూడా హోంశాఖ సీఆర్పీఎఫ్‌ భద్రత కల్పించింది. 

వీఐపీలకు ఎన్‌ఎస్‌జీ భద్రత తొలగింపు?

గాంధీ కుటుంబానికి ఎన్‌ఎస్‌జీ భద్రత తొలగిస్తూ మోదీ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వీఐపీలకు కూడా ఎన్‌ఎస్‌జీ భద్రత తొలగించాలని కేంద్ర సర్కార్‌ యోచిస్తోందట. ఈ మేరకు విశ్వసనీయ వర్గాల సమాచారం. వీరి స్థానంలో పారామిలిటరీ దళాలతో భద్రత కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని