భారత్‌ చేరుకున్న బ్రెజిల్‌ అధ్యక్షుడు

నాలుగు రోజుల పర్యటన కోసం బ్రెజిల్‌ అధ్యక్షుడు జాయిర్‌ బాల్సోనారో భారత్‌కు వచ్చారు. ఇప్పటికే ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగిన నేపథ్యంలో.. పరస్పర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్త్రృతం చేసేందుకు ఈ పర్యటన తోడ్పడనుంది. మరోవైపు జనవరి 26న నిర్వహించే 71వ గణతంత్ర వేడుకల్లో జాయిర్‌ బాల్సోనారో..

Published : 24 Jan 2020 23:41 IST


దిల్లీ: నాలుగు రోజుల పర్యటన కోసం బ్రెజిల్‌ అధ్యక్షుడు జాయిర్‌ బాల్సోనారో భారత్‌కు వచ్చారు. ఇప్పటికే ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగిన నేపథ్యంలో.. పరస్పర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్త్రృతం చేసేందుకు ఈ పర్యటన తోడ్పడనుంది. మరోవైపు జనవరి 26న నిర్వహించే 71వ గణతంత్ర వేడుకల్లో జాయిర్‌ బాల్సోనారో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ మేరకు ప్రధాని మోదీ బ్రెజిల్‌ పర్యటనలో ఉన్నప్పుడే ఆయన్ను ఆహ్వానించారు. గణతంత్ర వేడుకల అనంతరం బాల్సోనారో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌, ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు.

బ్రెజిల్‌ అధ్యక్షుడి భారత్‌ పర్యటన ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్త్రృతం చేస్తుందని, కీలక రంగాలను ఉత్తేజం చేసేందుకు సహకరిస్తుందని విదేశీ వ్యవహారాల కార్యదర్శి విజయ్‌ ఠాకూర్‌ సింగ్‌ తెలిపారు. బాల్సోనారోతోపాటు  8మంది మంత్రులు, నలుగురు ఎంపీలు, పలువురు ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తలు భారత్‌కు వచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని