Published : 16/01/2020 05:14 IST

రష్యా మంత్రివర్గం రాజీనామా

మాస్కో: రష్యా ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ రాజ్యాంగ సంస్కరణలను ప్రతిపాదించిన నేపథ్యంలో రష్యా మంత్రిమండలి రాజీనామా చేసింది. ఈ మేరకు రష్యాకు చెందిన పలు వార్తా సంస్థలు పేర్కొన్నాయి. రష్యా ప్రధాని మెడ్వెడెవ్‌ మాట్లాడుతూ.. ఈ ప్రతిపాదనలు దేశ అధికార సమతుల్యతలో పలు మార్పులను చేస్తాయని చెప్పారు. కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వంలోని మంత్రిమండలి రాజీనామా చేసింది అన్నారు. మార్పులు చేపట్టడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకునే అవకాశాన్ని అధ్యక్షుడికి కల్పించాలని అన్నారు. తదుపరి నిర్ణయాలన్నీ అధ్యక్షుడే తీసుకుంటారన్నారు. దీనిపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ స్పందిస్తూ.. ఇందు కోసం సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. అదేవిధంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు మెడ్వెడెవ్‌ను బాధ్యతలు తీసుకోమని కోరారు. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని