సూడాన్‌లో కూలిన విమానం..18 మంది మృతి

సూడాన్‌ ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ దర్‌ఫూర్‌ రాష్ట్ర రాజధాని ఎల్ జెనైనాలో టేకాఫ్‌ అయిన ఐదు నిమిషాల్లో ఓ విమానం కుప్పకూలింది.........

Published : 03 Jan 2020 10:26 IST

ఖార్తూమ్‌: సూడాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ దర్‌ఫూర్‌ రాష్ట్ర రాజధాని ఎల్ జెనైనాలో టేకాఫ్‌ అయిన ఐదు నిమిషాల్లోనే ఓ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందారు. మృతుల్లో ఏడుగురు సిబ్బంది, ముగ్గురు న్యాయమూర్తులు, నలుగురు చిన్నారులు సహా ఎనిమిది మంది పౌరులు ఉన్నారు.

సైనిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..జెనైనా ప్రాంతంలో గత కొన్ని రోజులుగా కొన్ని వర్గాల మధ్య తీవ్ర ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఈ క్రమంలో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వారం కనీసం 48 మంది మృత్యువాతపడ్డట్లు సమాచారం. మరో 241 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో వైద్య సేవలు అందించే నిమిత్తం బయలుదేరిన ఆంటొనొవ్‌ 12 రకానికి చెందిన విమానం ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని