China: అమెరికా నివేదికను తిప్పికొట్టిన చైనా.. అగ్రరాజ్యంతోనే అణు ముప్పని ఆరోపణ

ఊహించినదానికంటే వేగంగా ప్రస్తుతం చైనా తన అణ్వాయుధ సంపత్తిని పెంచుకుంటోందని అమెరికా రక్షణ శాఖ తాజాగా ఓ నివేదికలో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే దీన్ని డ్రాగన్‌ తీవ్రంగా ఖండించింది.

Published : 05 Nov 2021 04:37 IST

బీజింగ్‌: ఊహించినదానికంటే వేగంగా ప్రస్తుతం చైనా తన అణ్వాయుధ సంపత్తిని పెంచుకుంటోందని అమెరికా రక్షణ శాఖ తాజాగా ఓ నివేదికలో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే దీన్ని డ్రాగన్‌ తీవ్రంగా ఖండించింది. పూర్తి పక్షపాత ధోరణితో నివేదికను రూపొందించినట్లు తిప్పికొట్టింది. పైగా ఈ వ్యవహారాన్ని పెద్దదిగా చేసి చూపెడుతోందని చైనా ఆరోపించింది. చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ ఈ మేరకు స్పందించారు. గతంలోనూ అమెరికా విడుదల చేసిన ఆయా నివేదికల మాదిరిగానే ఇది కూడా వాస్తవాలను విస్మరించిందని విమర్శించారు. చైనా అణు ముప్పు గురించి ప్రచారం చేసేందుకు ఈ నివేదికను ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. ప్రపంచంలో అణు ముప్పునకు అమెరికానే అతిపెద్ద మూలమని అభివర్ణించారు.

చైనా వద్ద అణు వార్‌హెడ్‌ల సంఖ్య 2027 నాటికి 700కు చేరుకుంటుందని అమెరికా రక్షణ శాఖ నివేదిక అంచనా వేసిన విషయం తెలిసిందే. 2030 కల్లా ఆ సంఖ్య వెయ్యి దాటే అవకాశముందని పేర్కొంది. అగ్రరాజ్యం గతేడాది అంచనా వేసినదానికంటే రెండున్నర రెట్లు అధికం ఇది. చైనా వద్ద ఇప్పుడు ఎన్ని అణు వార్‌హెడ్‌లు ఉన్నాయన్నది మాత్రం తెలియజేయలేదు. గత ఏడాది లెక్కల ప్రకారం డ్రాగన్‌ వద్ద 200కు పైగా ఉన్నాయి. అమెరికాను తలదన్నే ప్రబల శక్తిగా ఎదగాలన్న లక్ష్యంతోనే ఆ దేశం తన అమ్ములపొదిలో భారీగా అణ్వస్త్రాలను చేర్చుకుంటున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని