Published : 12/09/2021 15:48 IST

9/11 Commission report : 9/11 ఉగ్రవాదులతో సౌదీ ప్రభుత్వానికి సంబంధం లేదు..!

 ఎఫ్‌బీఐ నివేదిక

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాలో 9/11 దాడుల్లోని హైజాకర్లకు, సౌదీ అరేబియా పాలకులకు ఎటువంటి సంబంధం లేదని చెప్పే ఒక దర్యాప్తు నివేదికను ఎఫ్‌బీఐ నేడు విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ స్థూపం వద్దకు వచ్చిన కొన్ని గంటల్లోనే ఎఫ్‌బీఐ దీనిని విడుదల చేసింది. గత వారం అధ్యక్షుడు కొన్నేళ్ల నుంచి ఉన్న పత్రాలను బహిర్గతం చేయాలని నిర్ణయించాక తొలిసారి దీనిని విడుదల చేశారు. ఉగ్ర దాడుల్లో మరణించిన వారి కుటుంబసభ్యులు కొన్నేళ్ల నుంచి సౌదీ పాత్ర పై దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. అంతేకాదు, బాధితులు, బంధువులు ఈ సారి బైడెన్‌పై తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారు. కీలక పత్రాలను విడుదల చేయకపోతే ట్విన్‌ టవర్స్ స్మారకమైన గ్రౌండ్‌ జీరో వద్ద కార్యక్రమానికి హాజరుకాకూడదని డిమాండ్‌ చేశారు.  

ఈ నేపథ్యంలో వచ్చే ఆరు నెలల్లో కీలక పత్రాలను బహిర్గతం చేయాలని జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌కు బైడెన్‌ సూచించారు. ఆయన ట్విన్‌ టవర్స్ వద్దకు వచ్చిన గంటల్లోనే తొలిపత్రాలు విడుదల అయ్యాయి. లాస్‌ ఏంజెల్స్‌ సౌదీ దౌత్య కార్యాలయంలో పనిచేసిన వ్యక్తి హైజాకర్లకు రవాణాలో సాయం చేసిన ఇద్దరితో సంబంధాలు ఉన్నట్లు తేలింది. 2001 దాడుల విచారణలో పాల్గొన్న వారిలో కొందరు అధికారులు సౌదీ పాత్రపై కూడా దర్యాప్తు చేశారు. కానీ, ఇప్పటి వరకు విడుదల చేసిన పత్రాల్లో కొత్తగా సౌదీకి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలను చూపించలేదు. సౌదీ ప్రభుత్వం నుంచి సాయం పొందిన ఛారిటబుల్‌ ట్రస్ట్‌లతో సంబంధం ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

ముఖ్యంగా అమెరికాలో అడుగుపెట్టిన నావాఫ్‌ అల్‌ హజీమ్‌, ఖలీద్‌ అల్‌ మిహిదర్‌లకు ఒమర్‌ అల్‌ బయుమీ అనే వ్యక్తి సాయం చేశాడు.  హలాల్‌ రెస్టారెంట్‌లో వీరితో భేటీ అయ్యారు. హైజాకర్లు శాన్‌ డియాగోలో ఒక అపార్ట్‌మెంట్‌ తీసుకోవడానికి ఒమర్‌ సాయం చేశాడు. ఈ నేపథ్యంలో సౌదీ ప్రభుత్వ పాత్రపై అనుమానాలు వచ్చాయి. ఈ క్రమంలో పలు దర్యాప్తులు నిర్వహించారు. మరోపక్క సౌదీ అరేబియా కూడా దాడుల్లో తన పాత్రను ఖండిస్తూ వస్తోంది. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని