భారత విదేశాంగశాఖ మంత్రి శ్రీలంక పర్యటన

మూడురోజుల పర్యటనలో భాగంగా భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ మంగళవారం శ్రీలంకకు వెళ్లనున్నట్లు విదేశాంగశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Published : 04 Jan 2021 23:53 IST

దిల్లీ: మూడురోజుల పర్యటనలో భాగంగా భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ మంగళవారం శ్రీలంకకు వెళ్లనున్నట్లు విదేశాంగశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా ఇరుదేశాల ద్వైపాక్షిక ప్రయోజనాల గురించి చర్చించనున్నట్లు విదేశాంగశాఖ సోమవారం తెలిపింది. గతేడాది శ్రీలంక అధ్యక్షుడు గోటబాయ రాజపక్స పూర్తి స్థాయి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్రీలంకను సందర్శించనున్న తొలి విదేశీ ప్రముఖుడు జైశంకర్‌ కానుండడం విశేషం. ఈ పర్యటనలో శ్రీలంక అధ్యక్షుడు గోటబాయ రాజపక్స, ప్రధాని మహింద రాజపక్స, రాజకీయ నిపుణుడు దినేశ్‌ గుణవర్ధనేయతో జైశంకర్‌ చర్చల్లో పాల్గొననున్నారు.

ఇవీ చదవండి..

పాకిస్థాన్‌కు అమెరికా మరో షాక్‌..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని