దిల్లీ అల్లర్లు: ఉమర్‌ ఖలీద్‌కు బెయిల్‌

దిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా గతేడాది దిల్లీలో చెలరేగిన అల్లర్లకు సంబంధించి జైలు శిక్ష అనుభవిస్తున్న... జేఎన్‌యూ మాజీ విద్యార్థి నేత, సామాజిక కార్యకర్త ఉమర్‌ ఖలీద్‌కు దిల్లీ‌ హైకోర్టు గురువారం బెయిల్‌  మంజూరు చేసింది.

Published : 15 Apr 2021 22:35 IST

దిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా గతేడాది దిల్లీలో చెలరేగిన అల్లర్లకు సంబంధించి జైలులో ఉన్న... జేఎన్‌యూ మాజీ విద్యార్థి నేత ఉమర్‌ ఖలీద్‌కు దిల్లీ‌ హైకోర్టు గురువారం బెయిల్‌  మంజూరు చేసింది. గతేడాది ఫిబ్రవరి 24న ఈశాన్య దిల్లీలో సీఏఏ అనుకూల, వ్యతిరేక ఆందోళనల మధ్య అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో సుమారు 50 మంది మృతి చెందగా, మరో 200 మందికి గాయాలయ్యాయి. ఇందులో ఇంటెలిజెన్స్‌ బ్యూరో అధికారి అంకిత్‌ శర్మ కూడా హత్య గురవ్వడం గమనార్హం. 

అయితే ఈ ఘటనలపై దిల్లీ క్రైం బ్రాంచ్‌ పోలీసులు..  ఉమర్‌ ఖలీద్‌తో పాటు పలువురిపై ఛార్జ్‌షిట్ నమోదు చేశారు.  జనవరి 8న షాహీన్‌బాగ్‌లో జరిగిన ఓ సమావేశంలో దిల్లీలో హింసాత్మక ఘటనలకు పలువురు ప్రణాళిక రచించినట్లు, ఇందులో ఖలీద్‌ ప్రమేయం కూడా ఉన్నట్లు అభియోగ ప్రతంలో పేర్కొన్నారు. దాంతో పాటే చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో ఉమర్‌ ఖలీద్‌ను గత అక్టోబర్‌లో పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ కేసులో ఉమర్‌ఖలీద్‌కు దిల్లీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు