Padma awards: పద్మభూషణ్‌ అవార్డునుతిరస్కరించిన బుద్ధదేవ్‌!

పశ్చిమబెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం వృద్ధ నేత బుద్ధదేవ్‌ భట్టాచార్య సంచలన ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం తనకు ప్రకటించిన పద్మభూషణ్‌ పురస్కారాన్ని....

Updated : 26 Jan 2022 02:18 IST

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం వృద్ధ నేత బుద్ధదేవ్‌ భట్టాచార్య సంచలన ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం తనకు ప్రకటించిన పద్మభూషణ్‌ పురస్కారాన్ని తిరస్కరిస్తున్నట్టు చెప్పారు. పద్మభూషణ్‌ అవార్డు రావడంపై తనకేమీ తెలియదనీ.. దీనిగురించి ఎవరూ తనకు చెప్పలేదన్నారు. ఒకవేళ పద్మభూషణ్‌ పురస్కారానికి తనను కేంద్రం ఎంపిక చేసినట్లయితే.. దాన్ని తిరస్కరిస్తున్నట్టు స్పష్టంచేశారు. బుద్ధదేవ్‌తో పాటు పార్టీ నిర్ణయం కూడా ఇదేనని సీపీఎం వర్గాల సమాచారం.

పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఏటా ఇచ్చే ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. నలుగురికి పద్మవిభూషణ్‌, 17మందికి పద్మభూషణ్‌, 107 మందికి పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌, బెంగాల్‌ నుంచి బుద్ధదేవ్‌ భట్టాచార్యతో పాటు పలువురు ప్రముఖులకు పద్మభూషణ్‌ పురస్కారాలను ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు