కరోనా వేళ.. మరోసారి వణికిస్తోన్న ఎబోలా!
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి కబళిస్తోన్న వేళ.. ప్రాణాంతక ఎబోలా మరోసారి విజృంభిస్తోంది. ముఖ్యంగా ఆఫ్రికాలోని పలు దేశాల్లో ఎబోలా కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది.
అప్రమత్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
జెనీవా: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి కబళిస్తోన్న వేళ.. ప్రాణాంతక ఎబోలా మరోసారి విజృంభిస్తోంది. ముఖ్యంగా ఆఫ్రికాలోని పలు దేశాల్లో ఎబోలా కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆఫ్రికాలోని ఆరు దేశాలను అప్రమత్తం చేసింది. ‘ఆఫ్రికాలో ఎబోలా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే ఆరు దేశాలను అప్రమత్తం చేశాం. దీన్ని ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని లైబీరియా, సయోర్రా లియోనె వంటి దేశాలకు సూచించాం. ప్రస్తుతం ఆయా దేశాలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి మార్గరెట్ హారిస్ పేర్కొన్నారు. కేవలం కాంగోలోనే ఇప్పటివరకు 300కేసులను గుర్తించగా, గినియాలో దాదాపు 109కేసులు నమోదైనట్లు వెల్లడించారు. వీటితో పాటు మరో రెండు దేశాల్లోనూ ఎబోలా కేసులు నమోదైనట్లు సమాచారం. అయితే, వీటి మూలాలను తెలుసుకునేందుకు ఇప్పటికే నమూనాలను విశ్లేషిస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
ఆఫ్రికాలోని గినియా దేశంలో ఎబోలా వ్యాప్తి మొదలైనట్లు అక్కడి ప్రభుత్వం రెండు రోజుల క్రితం ప్రకటించింది. ఇక్కడ 2013-16 తర్వాత మరోసారి ఎబోలా వ్యాప్తి వెలుగుచూసింది. ఇక డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఫిబ్రవరి 7న ఎబోలా కేసులు బయటపడినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే కరోనా వైరస్‌తో సతమతమవుతున్న ఆఫ్రికాలో ఎబోలా వెలుగు చూడడం కలవరపెట్టే విషయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉంటే, ఈ ప్రాణాంతక వ్యాధిని తొలిసారి 1976లో ఆఫ్రికాలో గుర్తించారు. ముఖ్యంగా 2013-16 మధ్యకాలంలో తీవ్ర ప్రభావం చూపిన ఈ వైరస్.. అప్పట్లో 28,646 మందిలో బయటపడింది. వీరిలో 11,323 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అనంతరం కాంగోలోనూ ఎబోలా విజృంభించింది. ఈ ప్రాణాంతక ఎబోలా వైరస్ వల్ల జ్వరం, కండరాల నొప్పి, విరేచనాలు, వాంతులు కావడంతో పాటు కాలేయం, మూత్రపిండాల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కొందరిలో శరీరం లోపల, బయట రక్తస్రావం జరుగుతుంది. ఎబోలా వల్ల దాదాపు 90శాతం ప్రాణాపాయం సంభవించే ప్రమాదం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్‌ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్‌లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్‌కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్‌కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు