టోక్యో సమీపంలో భూకంపం

జపాన్‌ రాజధాని టోక్యో నగరానికి సమీపంలో శనివారం భూపంకం సంభవించింది. జపాన్‌ వాతావరణ సంస్థ ట్విటర్‌ ద్వారా ఈ విషయం వెల్లడించింది. టోక్యో నగరానికి ఈశాన్యంగా 306 కిలోమీటర్ల దూరంలో భూకంపం.......

Published : 13 Feb 2021 22:20 IST

టోక్యో: జపాన్‌ రాజధాని టోక్యో నగరానికి సమీపంలో శనివారం భూపంకం సంభవించింది. జపాన్‌ వాతావరణ సంస్థ ట్విటర్‌ ద్వారా ఈ విషయం వెల్లడించింది. టోక్యో నగరానికి ఈశాన్యంగా 306 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్లు తెలిపింది. భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం దాదాపు 7:37 గంటలకు ఈ భూప్రకంపనలు సంభవించినట్లు వెల్లడించింది. భూకంపం తీవ్రత 7.0గా నమోదైనట్లు పేర్కొంది. భూ ఉపరితలం నుంచి 60 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూప్రకంపనల వల్ల ఇళ్లలోని వస్తువులు కదిలినట్లు పలువురు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్టు చేశారు.

ఇదీచదవండి

ఢోబాల్‌ ఇంటిపై ఉగ్రవాదుల రెక్కీ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని