దక్షిణ పసిఫిక్‌లో భూకంపం.. సునామీ హెచ్చరికలు

దక్షిణ పసిఫిక్‌ మహా సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై 7.7 మ్యాగ్నిట్యూడ్‌గా నమోదైంది. ఈ మేరకు ఆస్ట్రేలియా వాతావరణ విభాగం అధికారులు గురువారం వెల్లడించారు. ‘దక్షిణ పసిఫిక్‌ మహాసముద్రంలో భూకంపం సంభవించింది.

Published : 10 Feb 2021 22:18 IST

సిడ్నీ: దక్షిణ పసిఫిక్‌ మహా సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై 7.7 తీవ్రత నమోదైంది. ఈ మేరకు ఆస్ట్రేలియా వాతావరణ విభాగం అధికారులు గురువారం వెల్లడించారు. ‘దక్షిణ పసిఫిక్‌ మహాసముద్రంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై 7.7 తీవ్రత నమోదైంది. భూకంపం ఫలితంగా సముద్రంలో సునామీ ఏర్పడింది’ అని వాతావరణ శాఖ ట్విటర్‌లో వెల్లడించింది. లార్డ్‌ హౌ ఐలాండ్‌కు ఈ సునామీ ముప్పు పొంచి ఉందని వెల్లడించింది. ఆస్ట్రేలియా ప్రధాన భూభాగానికి ఈ ప్రాంతం 550 కిలోమీటర్ల దూరంలో ఉంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని