ఆ ప్రొటీన్‌ లోపం వల్లే.. ఐరోపాలో కరోనా ఉద్ధృతం!

ఊపిరితిత్తులకు రక్షణ కల్పించే ప్రొటీన్‌ లోపం కారణంగానే... ఐరోపా, ఉత్తర అమెరికా ప్రజలు ఎక్కువగా కరోనా బారిన పడ్డారని తాజా పరిశోధన విశ్లేషించింది.

Published : 10 Feb 2021 11:10 IST

దిల్లీ: ఊపిరితిత్తులకు రక్షణ కల్పించే ప్రొటీన్‌ లోపం కారణంగానే... ఐరోపా, ఉత్తర అమెరికా ప్రజలు ఎక్కువగా కరోనా బారిన పడ్డారని తాజా పరిశోధన విశ్లేషించింది. ఈ విషయంలో ఆసియా ప్రజలే మేలని పేర్కొంది. పశ్చిమ బెంగాల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోమెడికల్‌ జీనోమిక్స్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేపట్టారు. ఉత్తర అమెరికా, ఐరోపా ప్రాంతంలో అత్యధిక మందికి సోకిన ‘డీ614జీ’ ఉత్పరివర్తన రకం కరోనా వైరస్‌పై వారు అధ్యయనం సాగించారు. ‘‘ఉత్తర అమెరికా, ఐరోపా ప్రజల్లో శ్వాసవ్యవస్థను పరిరక్షించే ఆల్ఫా-యాంటీ-ట్రిప్సిన్‌ (ఏఏటీ) ప్రొటీన్‌ స్థాయిలు తక్కువగా ఉన్నట్టు గుర్తించాం. ఇది లోపించినవారి శరీరాల్లోకి ‘డీ614జీ’ రకం కరోనా వైరస్‌ త్వరగా చొచ్చుకెళ్లింది. స్పెయిన్, ఇటలీల్లో ఈ వైరస్‌ విజృంభించడానికి అక్కడి ప్రజల్లో ఏఏటీ లోపమే కారణమని భావిస్తున్నాం’’ అని పరిశోధనకర్త నిదాన్‌ బిశ్వాస్‌ వివరించారు.

ఇవీ చదవండి..

20 రోజుల క్రితం టీకా.. తాజాగా కరోనా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని