Swiggy: త్వరలో డ్రోన్ల ద్వారా ఫుడ్‌ డెలివరీ

త్వరలో డ్రోన్ల ద్వారా ఆహారాన్ని పంపిణీ చేసేందుకు స్విగ్గీ సన్నద్ధమవుతోంది. దీని కోసం డ్రోన్‌ డెలివరీ భాగస్వామి ఏఎన్‌ఆర్‌ఏ టెక్నాలజీస్‌ సహకారంతో ట్రయల్స్‌ ప్రారంభించింది.

Published : 18 Jun 2021 01:33 IST

ట్రయల్స్‌ ప్రారంభించిన స్విగ్గీ

దిల్లీ: త్వరలో డ్రోన్ల ద్వారా ఆహారాన్ని పంపిణీ చేసేందుకు స్విగ్గీ సన్నద్ధమవుతోంది. దీని కోసం డ్రోన్‌ డెలివరీ భాగస్వామి ఏఎన్‌ఆర్‌ఏ టెక్నాలజీస్‌ సహకారంతో ట్రయల్స్‌ ప్రారంభించింది. ఇప్పటికే దీని కోసం రక్షణ మంత్రిత్వ శాఖ, డైరక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఏవియేషన్‌, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు పొందారు. రాబోయే కొన్ని వారాల పాటు ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ట్రయల్స్‌ నిర్వహించనున్నారు.

స్విగ్గీ కోసం డ్రోన్లను అందిస్తున్న ఏఎన్‌ఆర్‌ఏ టెక్నాలజీస్‌ సంస్థ ఐఐటీ భాగస్వామ్యంతో వైద్య సేవలు, మందుల పంపిణీ వాటిపై ప్రయోగాలు చేస్తోంది. స్విగ్గీ ప్రోగ్రామ్ మేనేజర్ శిల్పా జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ.. డ్రోన్‌ టెక్నాలజీ నైపుణ్యాలను వినియోగించుకొనేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.  ప్రతి ఒక్కరికీ సేవలు అందించేందుకు కొత్త మార్గాలను ఎంచుకుంటామని తెలిపారు. ఏఎన్‌ఆర్‌ఏ సీఈవో అమిత్‌ గంజూ మాట్లాడుతూ.. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఎక్కువ మంది ప్రజలకు చేరువయ్యే అవకాశం లభించిందన్నారు.
వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సహకారంతో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ‘ మెడిసిన్‌ ఫ్రం స్కై’ ప్రాజెక్ట్‌ కింద  గూగుల్‌కు చెందిన డన్జో సంస్థ వ్యాక్సిన్లను డ్రోన్‌ డెలివరీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. డ్రోన్లను వినియోగించి బియాండ్‌ విజువల్‌ లైన్‌ ఆఫ్‌ సైట్‌ (బీవీఎల్‌ఓఎస్‌) ప్రయోగాలకు ఇటీవల కేంద్రం అనుమతించిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని