Modi: కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.. అదే దేశపు మంత్రం కావాలి: మోదీ

‘మరో 25 ఏళ్లు గడిస్తే దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు అవుతుంది. ఈ పాతికేళ్లు ఎవరికి వారు.. తమ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించాలి. అదే దేశపు మంత్రం కావాలి. ఈ విషయాన్ని పార్లమెంట్‌, శాసనసభల ద్వారా దేశానికి వినిపించాలి’’అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 82వ ఆల్‌ ఇండియా ప్రిసైడింగ్‌ ఆఫీసర్ల

Published : 17 Nov 2021 15:43 IST

దిల్లీ: ‘మరో 25 ఏళ్లు గడిస్తే దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు అవుతుంది. ఈ పాతికేళ్లు ఎవరికి వారు.. తమ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించాలి. అదే దేశపు మంత్రం కావాలి. ఈ విషయాన్ని పార్లమెంట్‌, శాసనసభల ద్వారా దేశానికి వినిపించాలి’’అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 82వ ఆల్‌ ఇండియా ప్రిసైడింగ్‌ ఆఫీసర్ల సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించిన మోదీ.. చట్టసభల్లో ఆరోగ్యకరమైన, సమగ్ర చర్చలు జరగాలని సూచించారు. ఆ చర్చలు అర్థవంతంగా, రాజకీయాలకు అతీతంగా, గౌరవప్రదంగా జరగాల్సిన అవసరముందన్నారు.

గత పార్లమెంట్‌ సమావేశాలు ఆందోళనలు.. అంతరాయాల మధ్య పెద్దగా చర్చలు జరగకుండానే వాయిదా పడ్డాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని.. చట్టసభ్యుల ప్రవర్తన దేశ విలువలకు అనుగుణంగా ఉండాలని మోదీ హితువు పలికారు. దేశ ఐక్యత, సమగ్రతకు వ్యతిరేకంగా గళమెత్తే శక్తుల పట్ల చట్టసభలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మనలోని ఐక్యమత్యమే భిన్నత్వాన్ని కాపాడుతుందని చెప్పారు. ప్రజాస్వామ్యం అనేది భారత దేశంలో ఒక వ్యవస్థ మాత్రమే కాదు.. భారతదేశ స్వభావమని ప్రధాని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని