Published : 17/09/2020 14:06 IST

ఆ డీల్‌ నచ్చలేదు..డొనాల్డ్‌ ట్రంప్‌

టిక్‌టాక్‌ డీల్‌ను పరిశీలిస్తానన్న అమెరికా అధ్యక్షుడు

వాషింగ్టన్‌: అమెరికాలో టిక్‌టాక్ యాజమాన్య హక్కులపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా అమెరికా కార్యకలాపాలను ఒరాకిల్‌ సంస్థ చేజిక్కించుకోనుందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ట్రంప్‌.. మెజారిటీ యాజమాన్య హక్కులు చైనా కంపెనీ చేతిలోనే ఉండటం తనకు నచ్చలేదని అభిప్రాయపడ్డారు. ‘టిక్‌టాక్‌ అమెరికాలో యాజమాన్య హక్కులను ప్రముఖ సంస్థ ఒరాకిల్‌ సొంతం చేసుకోనున్నట్లు నాకు తెలిసింది. అయితే, మెజారిటీ యాజమాన్య హక్కులు మాత్రం చైనా కంపెనీ బైట్‌డాన్స్‌ చేతిలోనే ఉన్నట్లు నాకు తెలిసింది. అదే నిజమైతే ఆ డీల్‌ నాకు నచ్చలేదు. అయితే, ఇది కచ్చితంగా జాతీయ భద్రతను సంబంధించిన విషయం కావున, మరోసారి టిక్‌టాక్‌-ఒరాకిల్‌ డీల్‌ను పరిశీలిస్తా’ అని అని డొనాల్డ్‌ ట్రంప్‌ విలేకరులతో పేర్కొన్నారు. త్వరలోనే ఈ డీల్‌ అంశం నా వద్దకు వస్తుందని..అప్పుడు మరింత పరిశీలిస్తానని ట్రంప్‌ చెప్పారు.

ఇదిలాఉంటే, టిక్‌టాక్‌ యాప్‌ అమెరికా కార్యకలాపాలను చైనా కంపెనీ చేతిలో ఉండకూడదని అధ్యక్షుడు ట్రంప్‌ స్పష్టంచేస్తున్నారు. దీంతో టిక్‌టాక్‌ అమెరికాలో వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు ఒరాకిల్‌, మైక్రోసాఫ్ట్‌తో పాటు మరికొన్ని సంస్థలు ఆసక్తి చూపాయి. చివరకు ఈ డీల్‌ నుంచి మైక్రోసాఫ్ట్‌ తప్పుకోగా, ఒరాకిల్‌ సంస్థ టిక్‌టాక్‌ హక్కులను సొంతం చేసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ నిర్ణయంపై అసంతృప్తిగానే ఉన్న ట్రంప్‌, చివరకు ఏవిధమైన నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ఆసక్తి నెలకొంది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని