Delta: అమెరికాలో డెల్టా వేరియంట్ విజృంభణ!
భారత్‌లో అమాంతం విరుచుకుపడిన కరోనా డెల్టా వేరియంట్ అమెరికాలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇతర వేరియంట్లతో పోలిస్తే డెల్టా వైరస్ ప్రధాన రకంగా మారిందని ఆ దేశ శాస్త్రవేత్తలు నిర్ధరించారు....
80 శాతం అవే కేసులు
వాషింగ్టన్: భారత్‌లో అమాంతం విరుచుకుపడిన కరోనా డెల్టా వేరియంట్ అమెరికాలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇతర వేరియంట్లతో పోలిస్తే డెల్టా వైరస్ ప్రధాన రకంగా మారిందని ఆ దేశ శాస్త్రవేత్తలు నిర్ధరించారు. అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతూ చిన్నారులపై ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలోని పలు ప్రాంతాల్లో నమోదవుతున్న కొత్త కేసుల్లో 80 శాతం కంటే అధికంగా డెల్టా రకం కేసులే వెలుగు చూస్తున్నట్లు అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం (సీడీసీ) వెల్లడించింది. మిస్సోరీ, కేన్సస్, అయోవా రాష్ట్రాల్లో 80 శాతం కేసులు డెల్టా వేరియంటే కావడం ఆందోళన కలిగిస్తోంది. ఉటా, కొలరాడో రాష్ట్రాల్లో పాజిటివ్‌గా తేలిన బాధితుల్లో 74.3 శాతం మందికి డెల్టా రకం సోకినట్లు సీడీసీ పేర్కొంది.
టీకా వేయించుకోని వారిపై డెల్టా వేరియంట్ ప్రభావం అధికంగా ఉన్నట్లు అమెరికా వైద్య నిపుణులు అన్నామోరీ డేవిడ్సన్ వివరించారు. కరోనా డెల్టా వేరియంట్‌కు సంక్రమణ తీవ్రత అధికమని.. దీన్ని తీవ్రమైనదిగా పరిగణించాలన్నారు. రానున్న రోజుల్లో ఇది మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నట్లు హెచ్చరించారు. గాల్వెస్టన్ కౌంటీ జిల్లా ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం.. ఆ జిల్లాలో నమోదైన 450 కేసుల్లో.. 6-12 ఏళ్ల మధ్య వయసు గల చిన్నారుల్లో 57 మంది డెల్టా బారిన పడ్డారు. కాగా ప్రస్తుత అధ్యయనాలను దృష్టిలో ఉంచుకుని చిన్నారులతో బహిరంగ ప్రదేశాలు, ప్రార్థనా మందిరాలకు వెళ్లే మహిళలు, ఇతరులు జాగ్రత్తగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
చిన్నారులు, యువకులు ఎక్కువగా డెల్టా బారిన పడుతుండటంపై ఆరోగ్య సిబ్బంది ఆందోళన చెందుతున్నట్లు డేవిడ్సన్ తెలిపారు. డెల్టా సోకితే చాలా వరకు ఆస్పత్రుల్లోనే చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని.. తీవ్రమైన శ్వాస సంబంధ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వివరించారు. అమెరికాలో చిన్నారులపై డెల్టా వేరియంట్ ప్రభావం అధికంగా ఉన్న నేపథ్యంలో రెండేళ్లు దాటిన చిన్నారులు తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చూడాలని తల్లిదండ్రులకు సూచించారు. డెల్టా సంక్రమించకుండా ఉండేందుకు 20అడుగుల వరకు భౌతిక దూరం పాటించాలని తెలిపారు. కరోనా స్పైక్ ప్రోటిన్లో ఉత్పరివర్తనం కారణంగానే డెల్టా అధికంగా వ్యాప్తి చెందుతున్నట్లు పేర్కొన్నారు. అమెరికాలో పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ జరగకపోతే డెల్టా వేరియంట్ వ్యాప్తి భయంకరంగా ఉండే అవకాశం ఉన్నట్టు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్‌పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్ లోక్‌సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్‌పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్‌ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్‌కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్‌కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్‌కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్‌ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్‌నవూ సెంచరీ హీరో
-
భారత్‌లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్