Delhi pollution: ‘కాలుష్యంతో సంబంధం లేకున్నా ఇబ్బంది పడాలా?’

దిల్లీ.. ఎన్‌సీఆర్‌ ప్రాంతాల్లో వాయుకాలుష్యం తీవ్రస్థాయికి చేరుకున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం పరిస్థితిని అదుపుచేసేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో దిల్లీ.. పరిసర ప్రాంతాల్లో పారిశ్రామిక కార్యకలాపాలు, భవన నిర్మాణాలు నిలిపివేయాలని ఆదేశించింది. దీంతో భవన నిర్మాణ

Published : 17 Nov 2021 23:38 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ.. ఎన్‌సీఆర్‌ ప్రాంతాల్లో వాయుకాలుష్యం తీవ్రస్థాయికి చేరుకున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం పరిస్థితిని అదుపుచేసేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో దిల్లీ.. పరిసర ప్రాంతాల్లో పారిశ్రామిక కార్యకలాపాలు, భవన నిర్మాణాలు నిలిపివేయాలని ఆదేశించింది. దీంతో భవన నిర్మాణ కార్మికులు దిల్లీ ప్రభుత్వ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఉపాధి కోల్పోయిన తమకు పరిహారం చెల్లించాలని కోరారు. ఈ మేరకు కార్మికుల తరఫున ‘నేషనల్‌ క్యాంపెన్‌  కమిటీ ఫర్‌ సెంట్రల్‌ లెజిస్లేషన్‌ ఆన్‌ కన్స్‌ట్రక్షన్‌ లేబర్‌’ కమిటీ పిటిషన్‌ దాఖలు చేసింది.

‘‘వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయకుండా.. లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికుల హక్కులను, జీవనోపాధిని ఈ అనవసరమైన నిషేధంతో దెబ్బతీస్తున్నారు. ముందస్తు నోటీసులు లేకుండా భవన నిర్మాణాలపై విధించిన ఈ నిషేధం వల్ల కార్మికులు దిక్కతోచనిస్థితిలో ఉన్నారు. సరి-బేసి ట్రాఫిక్‌ విధానం అమలు చేసే ముందు కొన్ని నెలల పాటు దానిపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. అదే కొన్ని లక్షల మంది కార్మికులు ఉపాధి పొందుతున్న నిర్మాణరంగంపై ఎలాంటి నోటీసులు లేకుండా నిషేధం విధించారు. దీని వల్ల కార్మికులు, గుత్తేదారులు ఆర్థికంగా ఇబ్బందులు పడతారు’’అని పిటిషన్‌లో సీఎల్‌సీఎల్‌ కమిటీ పేర్కొంది. వాయుకాలుష్య నియంత్రణకు కోట్ల రూపాయలు కేటాయిస్తున్న దిల్లీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు పరిహారం ఇవ్వడంలో విఫలమైందని తెలిపింది. వాయుకాలుష్యానికి ఏ మాత్రం కారకులు కానీ భవన నిర్మాణ కార్మికుల పట్ల అహేతుకంగా, ఏకపక్షంగా దిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎల్‌సీఎల్‌ కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని