Covid: ధూమపానంతో కరోనా ముప్పు అధికం

పొగతాగడంతో కరోనా ముప్పు తీవ్రత 50 శాతం అధికంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ

Updated : 31 May 2021 10:41 IST

ప్రపంచ ఆరోగ్య సంస్థ

జెనీవా: పొగతాగడంతో కరోనా ముప్పు తీవ్రత 50 శాతం అధికంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరించింది. ఈ వ్యసనం ఉన్నవారికి కొవిడ్‌ సోకితే మరణించే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయని తెలిపింది. ఇలాంటి వారికి క్యాన్సర్, గుండె రోగాలు వచ్చే ప్రమాదం ఉంటుందని, ఇప్పుడు కరోనా కారణంగా శ్వాసకోశ సమస్యలు మరింతగా పెరుగుతాయని పేర్కొంది. పొగాకును విడిచిపెట్టాలంటూ ప్రారంభించిన ‘కమిట్‌ టు క్విట్‌’ కార్యక్రమాన్ని డబ్ల్యూహెచ్‌ఓ సెక్రటరీ జనరల్‌ థెడ్రోస్‌ అధోనం గెబ్రెయేసస్‌ ప్రారంభించారు. ఈ వ్యసనాన్ని నిర్మూలించడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని, ఇందుకు అన్ని దేశాలు కృషి చేయాలని కోరారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో ‘క్విట్‌ ఛాలెంజ్‌’ ప్రచారాన్ని ప్రారంభించాలని సూచించారు.
ఈ-సిగరెట్లు, హీటెడ్‌ టుబాకో ప్రోడక్టు (హెచ్‌టీపీ)లను నిషేధిస్తూ చట్టం చేసినందుకు భారత ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ను అభినందిస్తూ అవార్డు అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని