Lockdown: కర్ణాటకలో పూర్తి లాక్‌డౌన్‌

కరోనా కేసులు అదుపులోకి రాకపోవడంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజుల పాటు పూర్తి్స్థాయి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 10......

Updated : 07 May 2021 20:26 IST

బెంగళూరు: కరోనా కేసులు అదుపులోకి రాకపోవడంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజుల పాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 10వ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి నుంచి 24వ తేదీ ఉదయం 6 గంటల వరకు వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని ముఖ్యమంత్రి యడియూరప్ప వెల్లడించారు. కరోనా కట్టడికి విధించిన కర్ఫ్యూ సత్ఫలితాలనివ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంచేశారు.

లాక్‌డౌన్‌ సమయంలో అన్ని హోటళ్లు, పబ్బులు, బార్లు మూసివేయాలని యడియూరప్ప ఆదేశించారు. నిత్యావసర, కూరగాయల దుకాణాలు మాత్రం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు తెరుచుకోవచ్చని తెలిపారు. లాక్‌డౌన్‌ సమయంలో ఉదయం 10 గంటల తర్వాత ఒక్కరిని కూడా అనుమతించేది లేదని స్పష్టంచేశారు. అయితే, ఇది తాత్కాలిక లాక్‌డౌన్‌ మాత్రమేనని, వలస కార్మికులెవరూ స్వస్థలాలకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని