క్రిమినల్‌ చట్టాల్లో సంస్కరణలకు కమిటీ

క్రిమినల్‌ చట్టాల్లో సంస్కరణలకు ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు బుధవారం రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది. ఈ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాలు, న్యాయస్థానాలు, బార్‌ కౌన్సిల్ల నుంచి సూచనలు సేకరిస్తుందని తెలిపారు.

Published : 03 Feb 2021 21:53 IST

దిల్లీ: క్రిమినల్‌ చట్టాల్లో సంస్కరణలకు ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు బుధవారం రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది. ఈ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాలు, న్యాయస్థానాలు, బార్‌ కౌన్సిల్ల నుంచి సూచనలు సేకరిస్తుందని తెలిపారు. దిల్లీ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు ఆయన రాతపూర్వక సమాధానమిచ్చారు. ‘‘ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సుప్రీంకోర్టు, హైకోర్టులు, బార్‌ కౌన్సిల్లు, విశ్వవిద్యాలయాలు, న్యాయ సంస్థల నుంచి క్రిమినల్‌ చట్టాల్లో మార్పుల కోసం సూచనలు తీసుకుంటాం. వాటి ద్వారా కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా హోంశాఖ సంస్కరణలను పరిశీలిస్తుంది.’’ అని ఆయన తెలిపారు.

ఇవీ చదవండి..

ఉరిశిక్ష పడ్డ ఖైదీ ఎలా తప్పించుకున్నాడు

ఇన్‌స్టాగ్రాం కొత్త ఫీచర్‌.. డిలీట్‌ చేసినా వెనక్కి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని