Corona: చైనాలో బయటపడ్డ కొత్తరకం స్ట్రెయిన్!
కరోనా పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో వైరస్ తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. వైరస్‌ను కట్టడించామని ఆనందించేలోపే మళ్లీ కొత్త కేసులు నమోదవుతుండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు....
అప్రమత్తమైన అధికారులు
బీజింగ్: కరోనా పుట్టినిల్లు చైనాలో వైరస్ తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. వైరస్‌ను కట్టడి చేశామని ఆనందించేలోపే మళ్లీ కొత్త కేసులు నమోదవుతుండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 1.5 కోట్ల మంది నివాసముండే గాంజావ్ నగరంలో 20 కొత్త కేసులు బయటపడటం అధికారుల్లో ఆందోళన రేకిత్తిస్తోంది. అప్రమత్తమైన ప్రభుత్వం పలు ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు విధించింది. తదుపరి ఆదేశాల వరకు అందరూ ఇళ్లల్లోనే ఉండాలని ఆదేశించింది.
గాంజావ్ నగరంలో వారం రోజుల్లో 20 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య చిన్నదే అయినప్పటికీ మహమ్మారిని అదుపుచేశామని ఆనందిస్తున్న అధికారుల్లో ఆందోళన రేకెత్తించింది. గత వేరియంట్ల కంటే ఈ కొత్త వేరియంట్ మరింత ప్రమాదకరమైనదని, చాలా ఉద్ధృతంగా ఉందని చైనా అధికారులు వెల్లడించినట్లు గ్లోబల్ టైమ్స్ వార్తాపత్రిక పేర్కొంది.
కొత్త వేరియంట్‌ను కనుగొనేందుకు లివాన్ జిల్లాలో శనివారం పరీక్షలకు ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలోని ఐదు ప్రాంతాల్లో ప్రజలకు పరీక్షలు నిర్వహించనుంది. బహిరంగ మార్కెట్లు, శిశు సంరక్షణ కేంద్రాలు, సాంస్కృతిక కార్యకలాపాలు, రెస్టారంట్లపై నిషేధం విధించింది. బహిరంగ కార్యక్రమాలను పరిమితం చేయాలని లివాన్‌కు చుట్టుపక్కల నాలుగు జిల్లాల అధికారులను ఆదేశించింది.
చైనాలో ప్రతిరోజు కొన్ని కేసులు నమోదవుతున్నాయి. అయితే వారంతా విదేశాల నుంచి వస్తున్నవారే. కానీ ఇద్దరు స్థానికులతోపాటు, దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో మరో 14 మందికి కొత్త రకం వైరస్ సోకినట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్‌లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్‌తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్‌ను ఎలా వాడాలి?
-
స్విమ్మింగ్ పూల్‌లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి