China: అత్యంత సంపన్నదేశంగా చైనా..!

కేవలం ఇరవై సంవత్సరాల్లో ప్రపంచ సంపద మూడు రెట్లు పెరిగింది. ఈ పెరుగుదల చైనాను సంపన్నదేశంగా తీర్చిదిద్దింది. మెకెన్సీ కో కన్సల్టెన్సీ పరోశోధన విభాగం ఈ విషయాన్ని వెల్లడించింది.

Updated : 24 Sep 2022 15:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కేవలం 20 సంవత్సరాల్లో ప్రపంచ సంపద మూడు రెట్లు పెరిగింది. ఈ పెరుగుదల చైనాను సంపన్నదేశంగా తీర్చిదిద్దింది. ‘మెకెన్సీ కో’ కన్సల్టెన్సీ పరోశోధన విభాగం ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ వృద్ధిలో పది దేశాలకు 60 శాతం వాటా చెందుతుందని పేర్కొంది. చైనా ఈ క్రమంలో అమెరికాను దాటేసింది. ‘‘మనం ఎన్నడూ లేనంత సంపన్నులం’’ అని ఈ పరిశోధనలో మెకెన్సీ గ్లోబల్‌ ఇన్‌స్టిట్యూట్‌కు భాగస్వామిగా వ్యవహరించిన జాన్‌ మిస్చేక్‌ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

2000 సంవత్సరంలో 156 ట్రిలియన్‌ డాలర్లు ఉన్న ప్రపంచ సంపద ఇప్పుడు 514 ట్రిలియన్‌ డాలర్లుగా పెరగింది. ఈ పెరుగుదలలో మూడోవంతు చైనాదే కావడం విశేషం. 2000లో 7 ట్రిలియన్‌ డాలర్లగా ఉన్న చైనా సంపద పెరిగి 120 ట్రిలియన్‌ డాలర్లకు చేరింది. అమెరికాలో స్థిరాస్తి ధరల పెరుగుదలలో మార్పుల కారణంగా ఆ దేశ సంపద ఈ సమయంలో కేవలం 90 ట్రిలియన్‌ డాలర్లు మాత్రమే వృద్ధి చెందింది. చైనా, అమెరికాల్లో మూడింట రెండోంతుల సంపద కేవలం 10శాతం మంది వద్ద మాత్రమే పోగుపడినట్లు లెక్కలు చెబుతున్నాయి.

మెకెన్సీ లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంపదలో 68శాతం రియల్‌ ఎస్టేట్‌ రంగంలోనే ఉంది. మిగిలినవి ఇన్ఫ్రా, మెషినరీ, పరికరాల్లో ఉండగా.. చాలా తక్కువ మొత్తం మాత్రమే పేటెంట్లు, మేధోహక్కుల్లో ఉంది. వివిధ కారణాలతో ఫైనాన్షియల్‌ ఆస్తులను మాత్రం ప్రపంచ సంపదలో చూపించలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని