సోషల్‌మీడియాలో ఆస్తుల్ని ప్రదర్శించొద్దు.. ప్రముఖులకు చైనా సర్కార్‌ ఆదేశం!

చైనాలో మీడియా, ఇంటర్నెట్‌ వినియోగంపై కఠినమైన ఆంక్షలు ఉంటాయన్న విషయం తెలిసిందే. భావ ప్రకటన స్వేచ్ఛ అక్కడి వారికి అందని ద్రాక్ష అని చెప్పుకోవచ్చు. తాజాగా చైనాలోని సినీ ప్రముఖుల వ్యక్తిగత విషయంలోనూ చైనా ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపై సినీ ప్రముఖలు ఎవరైనా చైనా సోషల్‌మీడియాలో

Published : 26 Nov 2021 01:51 IST

బీజింగ్‌: చైనాలో మీడియా, ఇంటర్నెట్‌ వినియోగంపై కఠినమైన ఆంక్షలు ఉంటాయన్న విషయం తెలిసిందే. భావ ప్రకటన స్వేచ్ఛ అక్కడి వారికి అందని ద్రాక్ష అనే చెప్పుకోవాలి. తాజాగా చైనాలోని సినీ ప్రముఖుల వ్యక్తిగత విషయంలోనూ అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చైనా సైబర్‌స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగం ప్రకటన విడుదల చేసింది.

ఇకపై సినీ ప్రముఖలు ఎవరైనా చైనా సోషల్‌మీడియాలో తమ ఆస్తుల్ని, అమితానందాన్ని ప్రదర్శించకూడదనేది ఆ ప్రకటన సారాంశం. ఈ నిబంధన ప్రముఖులకు సంబంధించిన తప్పుడు వార్తలు, అభిమానుల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వదంతుల వ్యాప్తిని అడ్డుకుంటుందని ప్రభుత్వం చెబుతోంది. ‘ప్రముఖులు, అభిమానుల సోషల్‌మీడియా పోస్టులు ప్రజాభిప్రాయాలు, విలువలకు కట్టుబడి ఉండాలి. సోషల్‌మీడియాలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కొనసాగించాలి’ అని డ్రాగన్‌ సర్కార్‌ సూచించింది. చైనా సినీపరిశ్రమను కూడా అక్కడి ప్రభుత్వం తమ గుప్పిట్లో పెట్టుకోవడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read latest National - International News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని